సిక్సర్ల పిడుగు వైభవ్ సూర్యవంశీ మళ్లీ ఏడ్చేశాడు.. వీడియో వైరల్
ABN , Publish Date - Apr 20 , 2026 | 05:05 PM
ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. రాజస్థాన్ రాయల్స్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కుర్రాడు తమ జట్టు ఓడిపోయిందని కన్నీళ్లు పెట్టుకున్నాడు మరి!
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. రాజస్థాన్ రాయల్స్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట ఆర్ఆర్‌కు ఓపెనర్లు బలమైన పునాది వేసినా.. ఆ జట్టు ఉపయోగించుకోలేకపోయింది. ఫామ్ అందుకున్న వరుణ్ చక్రవర్తి ధాటికి విలవిలలాడి ఆర్ఆర్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. అయితే యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ(46) త్రుటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. వైభవ్ మినహా ఇతర బ్యాటర్లు ఎవరూ ఎక్కువ సేపు క్రీజలో నిలబడలేకపోయారు. స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ బ్యాటర్లు ఛేదించి గెలిచేశారు. అయితే వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కుర్రాడు తమ జట్టు ఓడిపోయిందని కన్నీళ్లు పెట్టుకున్నాడు మరి!
ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్‌తోనూ ఆర్ఆర్ ఓడిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా వైభవ్ ఏడ్చేశాడు. జట్టు కోసం ఎక్కువ పరుగులు చేయలేకపోయానని బాధ పడ్డాడు. తాజాగా కేకేఆర్‌పై ఓటమి తర్వాత ఓ మూలన కుర్చొని వైభవ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. క్యాప్‌తో ముఖాన్ని దాచుకుంటూ బాధను వ్యక్తం చేశాడు. ఆ సమయంలో కేకేఆర్ సిబ్బందిలో ఒకరు అతడి వద్దకు వచ్చి ఓదార్చారు. వైభవ్ పక్కన కూర్చొని కాసేపు మాట్లాడి, ఆలింగనం చేసుకుని ధైర్యం చెప్పారు. ఫోన్‌లో తమ తల్లిదండ్రులతో మాట్లాడుతూ కూడా సూర్యవంశీ ఏడ్చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 15 ఏళ్ల కుర్రాడి మనస్తత్వం ఇలాగే ఉంటుందని, ఆ వయసులో ఉంటే తాము కూడా ఏడ్చేసేవాళ్లమంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.
.ప్రస్తుత సీజన్‌లో సూర్యవంశీ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఆరు మ్యాచ్‌లలో 246 పరుగులు చేసి టాప్ రన్ గెటర్లలో నాలుగో స్థానంలో నిలిచాడు. రెండు హాఫ్ సెంచరీలతో పాటు 78 అత్యధిక స్కోర్‌గా నమోదు చేశాడు. మొత్తం ఐపీఎల్ కెరీర్‌లో 13 మ్యాచ్‌లలో 498 పరుగులు చేసి తన ప్రతిభను మరింత బలంగా నిరూపిస్తున్నాడు. ఓటమి బాధతో కన్నీళ్లు పెట్టుకున్నా... ఈ యువ ఆటగాడి ప్రతిభ మాత్రం భవిష్యత్తులో భారత క్రికెట్‌కు పెద్ద ఆశగా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తమవుతోంది.
ఇవి కూడా చదవండి:
సరికొత్త అధ్యాయం.. టీ20 క్రికెట్ ఫ్రాంచైజీ సహ యజమానిగా క్రిస్ గేల్
బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఒకేసారి రెండు టీ20 జట్లు!