పీకల్లోతు కష్టాల్లో ముంబై ఇండియన్స్.. హార్దిక్ అసహనానికి చెక్ పడుతుందా?
ABN , Publish Date - Apr 20 , 2026 | 04:08 PM
బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబై ఇండియన్స్.. ఐపీఎల్ 2026లో విజయాల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఆడిన ఐదు మ్యాచుల్లో కేవలం ఒకే ఒక్క విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. మరి ఈరోజైనా ఎంఐ గెలుస్తుందా? గుజరాత్ టైటాన్స్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో ఓడితే హార్దిక్ పాండ్య, ముంబై ఇండియన్స్ పరిస్థితి ఏంటి?
ఇంటర్నెట్ డెస్క్: జట్టు నిండా స్టార్ ప్లేయర్లే.. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్.. టీమిండియాకు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్లు ఉన్నారు. అస్త్రాలు సంధించే బౌలర్లు ఉన్నారు. కీలక పోరులో ముందుండి నడిపించిన ప్లేయర్లూ ఉన్నారు.. కానీ ఈ సీజన్ ఐపీఎల్‌లో మాత్రం అట్టడుగు స్థాయిలో ఉంది. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుందిగా! అదే ముంబై ఇండియన్స్ జట్టు. రోహిత్ శర్మను కెప్టెన్‌గా తీసేసి హార్దిక్ పాండ్యకు జట్టు పగ్గాలు అందించినప్పటి నుంచి మొదలైన వివాదం.. నేటికీ కొనసాగుతూనే ఉంది. ఏ ఇతర జట్టుకు లేనంత బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబై ఇండియన్స్.. ఐపీఎల్ 2026లో విజయాల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఆడిన ఐదు మ్యాచుల్లో కేవలం ఒకే ఒక్క విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. మరి ఈరోజైనా ఎంఐ గెలుస్తుందా? గుజరాత్ టైటాన్స్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో ఓడితే హార్దిక్ పాండ్య, ముంబై ఇండియన్స్ పరిస్థితి ఏంటి?
బుమ్రా ఫామ్ అందుకుంటాడా?
బూమ్ బూమ్ బుమ్రా.. బంతి అందుకున్నాడంటే వికెట్ పడాల్సిందే! జట్టు కష్టాల్లో ఉందంటే కెప్టెన్‌కు గుర్తొచ్చే మొదటి పేరు బుమ్రా. మరి బుమ్రాస్త్రాలు సంధించి వికెట్లు తీసి జట్టు గెలుపులో భాగం కావాల్సిన ఈ స్టార్ పేసర్.. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటి వరకు బుమ్రా ఇంకా వికెట్ ఖాతా తెరవకపోవడం కొసమెరుపు. సీనియర్లు బౌల్ట్, శార్దూల్ ఠాకూర్ కూడా వికెట్లు తీయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ సీనియర్ బౌలర్లు వికెట్లు తీయడానికి తీవ్రంగా శ్రమిస్తుండటం జట్టుకు పెద్ద తలనొప్పిగా మారింది. అత్యంత కీలకమైన నేటి మ్యాచ్‌లో బౌలర్లు ఫామ్ అందుకుంటారా? బుమ్రా తన వికెట్ల ఖాతా తీసి మునుపటి ఫామ్‌ను అందుకుంటాడా? చూడాల్సి ఉంది.
బ్యాటర్లు విఫలం..
సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ బ్యాటింగ్‌లో ప్రభావం చూపించడం లేదు. ఇక రోహిత్ శర్మ గాయం కారణంగా గత మ్యాచ్‌కు దూరమయ్యాడు. నేడు గుజరాత్ టైటాన్స్‌తో ఆడుతాడా? లేదా? అనే విషయంపై స్పష్టత లేదు. రోహిత్ గాయం కారణంగా ఓపెనర్‌గా బరిలోకి దిగిన క్వింటన్ డికాక్ తొలి మ్యాచులోనే సెంచరీతో అదరగొట్టాడు. కానీ అతడి శ్రమ వృథాగానే పోయింది. అతడికి తోడు కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కూడా రాణిస్తే విజయాలు అందుకోవడం కాస్త సులువైన పనే. కానీ హార్దిక్ తీవ్రంగా నిరాశపరుస్తూ వస్తున్నాడు. 4 మ్యాచుల్లో కేవలం 81 పరుగులే చేశాడు. ఇక బౌలింగ్‌లో అతడు తీసింది కేవలం రెండే వికెట్లు.
కెప్టెన్‌కు ఉండాల్సిన లక్షణాలేవి?
ఆడిన ఏడు మ్యాచుల్లో కేవలం ఒక్కటే విజయాన్ని నమోదు చేసింది కేకేఆర్. ఆ జట్టు కెప్టెన్ అజింక్య రహానె ఎలాంటి ఒత్తిడిలోనూ జట్టు సహచరులతో అనుచితంగా ప్రవర్తించిన దాఖలాలే లేవు. మరి హార్దిక్ పాండ్య ఎందుకు సహనం కోల్పోతున్నాడు? అనేది అభిమానుల ప్రశ్న. గత మ్యాచులో బుమ్రాపై కాస్త అసహనం ప్రదర్శించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. వరుసగా ఓటములు ఎదురైనప్పుడు సంయమనం పాటించడం కెప్టెన్‌కు ఉండాల్సిన లక్షణం. అదే హార్దిక్‌లో లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్లేయర్‌గా మెరుగైన ఆటతీరు ప్రదర్శించకపోతే కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తప్పించే అవకాశం లేకపోలేదు.
ఇవి కూడా చదవండి:
సరికొత్త అధ్యాయం.. టీ20 క్రికెట్ ఫ్రాంచైజీ సహ యజమానిగా క్రిస్ గేల్
బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఒకేసారి రెండు టీ20 జట్లు!