ఐపీఎల్ చరిత్రలో తొలి బౌలర్‌గా జోఫ్రా ఆర్చర్..
ABN , Publish Date - Apr 20 , 2026 | 02:45 PM
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఓ చారిత్రక ఘనత సాధించాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్(IPL) 2026లో పలువురు ఆటగాళ్లు వ్వరికీ సాధ్యం కాని రికార్డులను నమోదు చేస్తున్నారు. అంతేకాక ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్లుగా నిలిచే రికార్డులు నమోదు చేస్తున్నారు. ఇటీవలే సన్ రైజర్స్ హైదరాబాద్ యువ పేసర్ ప్రఫుల్ హింగే అరంగేట్రం మ్యాచ్‌లో అందులోనూ తొలి ఓవర్లోనే మూడు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. తాజాగా నిన్న (ఆదివారం) రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కూడా ఓ చారిత్రక ఘనత సాధించాడు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...
ఆదివారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో జోఫ్రా ఆర్చర్ తొలి బంతికే వికెట్ తీశాడు. దీంతో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసిన తొలి ఆటగాడిగా ఆర్చర్ చరిత్ర సృష్టించాడు. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ప్లేయర్ ఈ ఘనత సాధించలేదు. అలాంటి అరుదైన ఘనతను సాధించిన తొలి ఆటగాడిగా ఈ ఇంగ్లండ్ బౌలర్ నిలిచాడు. నిన్నటి మ్యాచ్‌లో155 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో అర్చర్ ఇన్నింగ్స్ తొలి బంతికే టిమ్ సీఫర్డ్ ఔట్ చేశాడు. దీనికి ముందు రెండు మ్యాచ్‌ల్లో కూడా తొలి బంతులకే ఆర్సీబీ ఫిల్ సాల్ట్, ఎస్‌ఆర్‌హెచ్ అభిషేక్ శర్మను ఔట్ చేశాడు.
కేకేఆర్ బ్యాటర్ టిమ్ సీఫర్ట్ వికెట్‌తో ఆర్చర్ మరో ఆల్‌టైమ్ ఐపీఎల్ రికార్డును కూడా సమం చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఇన్నింగ్స్ తొలి బంతికే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా మహమ్మద్ షమీ ఉన్నాడు. అతడు ఖాతాలో 5 సార్లు తొలి బంతికే వికెట్ తీశాడు. తాజాగా ఆ రికార్డును ఆర్చర్ సమం చేశాడు. జోఫ్రా తన ఐపీఎల్ కెరీర్‌లో పృథ్వీ షా, ప్రియాంశ్ ఆర్య, ఫిల్ సాల్ట్, అభిషేక్ శర్మ, టిమ్ సీఫర్ట్‌ను ఇన్నింగ్స్ తొలి బంతికే ఔట్ చేశాడు. వీరి తర్వాతి స్థానాల్లో ట్రెంట్ బౌల్ట్, ఉమేశ్ యాదవ్, లసిత్ మలింగ, భువనేశ్వర్ కుమార్, పాట్ కమిన్స్ ఉన్నారు. వీరంతా తలో మూడు సార్లు ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్లు తీశారు.
ఐపీఎల్‌లో ఎక్కువ సార్లు తొలి బంతికే వికెట్ తీసిన బౌలర్లు
జోఫ్రా ఆర్చర్- 5
మహమ్మద్ షమీ*-5
ట్రెంట్ బౌల్ట్- 3
ఉమేశ్ యాదవ్-3
లసిత్ మలింగ-3
భువనేశ్వర్ కుమార్-3
ప్రవీణ్ కుమార్-3
అశోక్ దిండా -3
ప్యాట్ కమిన్స్ -3
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్‌లో 'బ్లాక్ మ్యాజిక్' జరిగింది... లలిత్ మోదీ సంచలన కామెంట్స్
భారత పౌరసత్వ ఆఫర్.. స్పందించిన రషీద్ ఖాన్!