విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్‌ను అధిగమించిన పాక్ బ్యాటర్
ABN , Publish Date - Apr 20 , 2026 | 11:29 AM
పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ తన రెండేళ్ల సెంచరీ నిరీక్షణకు తెరదించాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్2026 భాగంగా ఆదివారం క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పెషావర్ జల్మీ తరఫున బాబర్ ఒక అద్భుతమైన శతకం సాధించాడు.
స్పోర్ట్స్ డెస్క్: పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్... తన రెండేళ్ల సెంచరీ నిరీక్షణకు తెరదించాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్2026 భాగంగా ఆదివారం క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పెషావర్ జల్మీ తరఫున బాబర్ అజామ్ ఒక అద్భుతమైన శతకం సాధించాడు. పెషావర్ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేయగా.. క్వెట్టాను 137 పరుగులకే ఆలౌటైంది. దీంతో 118 పరుగుల తేడాతో పెషావర్ జట్టు భారీ విజయాన్ని నమోదు చేశారు.
ఇటీవలి కాలంలో పరుగుల కోసం ఇబ్బంది పడుతున్న ఈ పాక్ మాజీ కెప్టెన్ 783 రోజుల విరామం తర్వాత వంద పరుగుల మార్కును అందుకున్నాడు. ఈ శతకంతో బాబర్ అద్భుతంగా ఫామ్‌లోకి తిరిగి రావడమే కాకుండా, టీ20 బ్యాటింగ్ ఎలైట్ జాబితాలో భారత స్టార్ విరాట్ కోహ్లీ, వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్‌ను అధిగమించాడు. టీ20 ఫార్మాట్‌లో బాబర్ కేవలం 338 ఇన్నింగ్స్‌ల్లోనే 12,000 పరుగులు పూర్తి చేశాడు. దీంతో ఈ మైలురాయిని సాధించిన ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బ్యాటర్‌గా బాబర్ నిలిచాడు. 12 వేల మార్కును క్రిస్ గెల్ 344 ఇన్నింగ్స్‌ల్లో, విరాట్ కోహ్లీ 360 ఇన్నింగ్స్‌లలో సాధించారు.
క్వెట్టాపై చేసిన శతకం బాబర్‌కు 12వ టీ20 సెంచరీ. దీంతో అత్యధిక టీ20 సెంచరీలు సాధించిన బ్యాటర్ల జాబితాలో అతను రెండో స్థానంలో నిలిచాడు. 22 సెంచరీలతో గేల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బాబర్ తన చివరి టీ20 సెంచరీని 2024 ఫిబ్రవరిలో సాధించాడు. బాబర్ తన ఇన్నింగ్స్‌లో మరొక ప్రత్యేకమైన రికార్డును కూడా నెలకొల్పాడు. అతను కేవలం 52 బంతుల్లోనే 100 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో కేవలం ఒకే ఒక్క డాట్ బాల్‌ను ఎదుర్కొవడం విశేషం. టీ20 క్రికెట్ చరిత్రలో ఒక బ్యాటర్ 50కి పైగా బంతులను ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క డాట్ బాల్ ఆడటం ఇదే తొలిసారి. మొత్తంగా సుదీర్ఘ విరామం తర్వాత సెంచరీ చేయడమే కాకుండా పలు రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు ఈ పాకిస్థాన్ సీనియర్ ప్లేయర్.
ఇవి కూడా చదవండి:
ఓటమి అనంతరం లఖ్‌నవూ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు