కష్టపడే మనస్తత్వం, తెలివితేటలు.. ఇవే తమిళ ప్రజల విజయరహస్యం: చంద్రబాబు
ABN , Publish Date - Apr 20 , 2026 | 02:07 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఎన్డీయే భాగస్వామ్య పక్షాల తరఫున తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ రోజు, రేపు వివిధ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించనున్నారు.
చెన్నై, ఏప్రిల్ 20: కష్టపడే మనస్తత్వం, తెలివితేటలు.. ఇవే తమిళ ప్రజల విజయరహస్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తమిళ ప్రజలలాగా మాతృ భాషను ప్రేమించేవారు లేరనడంలో అతిశయోక్తి లేదని అన్నారు. సోమవారం ఆయన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల తరఫున తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ రోజు, రేపు వివిధ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1.00 గంటకు కోయింబత్తూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తమిళనాడు అంటే ద్రవిడ సంస్కృతికి మూలం. తమిళనాడులో ఆచారాలు, అలవాట్లు ఎప్పటికీ ప్రత్యేకం. తమిళం అంటేనే అత్యంత ప్రాచీన భాషల్లో ఒకటి. అత్యంత ప్రాచీన నాగరికతల్లో తమిళనాడు ఒకటి. ఒకప్పుడు దక్షిణాదిలో పారిశ్రామిక కేంద్రం కోయంబత్తూరు. మన భాష ఏదైనా మనమంతా ద్రవిడులం. మహిళలకు డీఎమ్‌కే, కాంగ్రెస్ పార్టీలు ద్రోహం చేశాయి. మహిళలకు రిజర్వేషన్లు రాకుండా అడ్డుకున్నాయి’..
‘రాజకీయ ఎజెండాతోనే డీఎమ్‌కే, కాంగ్రెస్ మహిళా రిజర్వేషన్లను అడ్డుకున్నాయి. మహిళా రిజర్వేషన్లపై మోదీ నిర్ణయం చాలా గొప్పది. కాంగ్రెస్, డీఎమ్‌కే కుట్రపూరితంగా అడ్డుకుని మహిళలకు ద్రోహం చేశాయి. ప్రతీ మహిళా రిజర్వేషన్ల అంశంపై ఆలోచించాలి’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
ఫ్యాటీ లివర్‌కు చెక్ పెట్టే సహజ ఆహారాలు
జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లోకి రావడం..హరీశ్ రావుకు ఇష్టం లేదు: ఎమ్మెల్యే సంజయ్