సరికొత్త అధ్యాయం.. టీ20 క్రికెట్ ఫ్రాంచైజీ సహ యజమానిగా క్రిస్ గేల్
ABN , Publish Date - Apr 20 , 2026 | 03:17 PM
యూనివర్సల్ బాస్.. వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. యూరప్‌లో ఐసీసీ ఆమోదం పొందిన తొలి ఫ్రాంచైజీ టోర్నమెంట్‌గా రూపొందుతున్న ది యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో గేల్ భాగమయ్యాడు. గ్లాస్గో ముగాఫియన్స్ అనే జట్టుకు సహ యజమానిగా వ్యవహరించనున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: యూనివర్సల్ బాస్.. వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. యూరప్‌లో ఐసీసీ ఆమోదం పొందిన తొలి ఫ్రాంచైజీ టోర్నమెంట్‌గా రూపొందుతున్న ది యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో గేల్ భాగమయ్యాడు. గ్లాస్గో ముగాఫియన్స్ అనే జట్టుకు సహ యజమానిగా వ్యవహరించనున్నాడు. భారత వ్యాపారవేత్త తాన్షా బాత్రా, గేల్ కలిసి ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేశారు. అంతేకాకుండా క్రిస్ గేల్ ఈ జట్టుకు గ్లోబల్ బ్రాండ్ అంబాసిబర్‌గా కూడా నియమితుడయ్యాడు.
ఫ్రాంచైజీ లాంచ్ సందర్భంగా గేల్ మాట్లాడాడు. ‘కో ఓనర్‌గా ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీ20 లీగ్‌లలో ఆడిన అనుభవంతో ఈటీపీఎల్‌లో భాగమయ్యాను. ఈ టోర్నీ కూడా ఒక ప్రత్యేక స్థానం సంపాదిస్తుందని నమ్ముతున్నాను. మరోవైపు తాన్షా బాత్రా కూడా ఈ ఫ్రాంచైజీ ద్వారా స్కాట్లాండ్ క్రికెట్‌ను ప్రపంచానికి పరిచయం చేయనున్నారు’ అని గేల్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ది యూరోపియన్ టీ20 ప్రిమియర్ లీగ్‌లో ఆరు జట్లు భాగం కానున్నాయి. స్కాట్లాండ్ దేశం నుంచి ఈ గ్లాస్గో ముగాఫియన్స్ ప్రాతినిధ్యం వహించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీ20 లీగ్‌లన్నింటిలో కలిపి గేల్ ఏకంగా 463 మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పుడు ఫ్రాంచైజీకి కో ఓనర్‌గా కొత్త అధ్యాయం ప్రారంభించాడు. కాగా ఈ టోర్నమెంట్ ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 20 వరకు జరగనుంది.
ఈటీపీఎల్‌కు బాలీవుడ్ ప్రముఖ నటుడు అభిషేక్ బచ్చన్ కూడా సహ యాజమానిగా ఉన్నాడు. ఈ టోర్నీలో క్రికెట్ ఐర్లాండ్, క్రికెట్ స్కాట్లాండ్, రాయల్ డచ్ క్రికెట్ అసోసియేషన్ భాగస్వామ్యం అయ్యాయి. గ్లాస్గో, ఆమ్‌స్టర్‌డ్యామ్, ఎడిన్‌బర్గ్, డబ్లిన్ బెల్‌ఫాస్ట్, రాటర్‌డ్యామ్ రూపంలో ఆరు జట్లు ఈ లీగ్‌లో భాగంగా ఉన్నాయి. ఆమ్‌స్టర్‌డ్యామ్ ఫ్రాంచైజీని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా, హాకీ స్టార్ జెమీ డైయర్ సొంతం చేసుకున్నారు. ఈ జట్టుకు ఆసీస్ టీ20 కెప్టెన్ మిచెల్ మార్ష్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
ఇవి కూడా చదవండి:
భారత పౌరసత్వ ఆఫర్.. స్పందించిన రషీద్ ఖాన్!
విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్‌ను అధిగమించిన పాక్ బ్యాటర్