ఐపీఎల్ 2026: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్.. టాస్ నెగ్గిన సన్‌రైజర్స్
ABN , Publish Date - May 03 , 2026 | 03:14 PM
ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో కేకేఆర్ తొలుత ఫీల్డింగ్ చేయనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో కేకేఆర్ తొలుత ఫీల్డింగ్ చేయనుంది. వరుసగా ఐదు విజయాలతో దూకుడు మీద ఉన్న సన్‌రైజర్స్.. రెట్టింపు ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తిరిగి జట్టులో చేరడం.. యువ బౌలర్లు సత్తా చాటుతుండటంతో హైదరాబాద్ అదరగొడుతోంది. విధ్వంసకారులతో నిండిన ఎస్‌ఆర్‌హెచ్ జట్టును ఆపాలంటే కోల్‌కతా అత్యుత్తమంగా రాణించాల్సిందే. ఈ సీజన్‌లో కేకేఆర్ 8 మ్యాచ్‌లు ఆడి రెండే గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే సన్‌రైజర్స్ ఆడిన 9 మ్యాచుల్లో 6 గెలిచి మూడో స్థానంలో కొనసాగుతోంది.
ఎస్ఆర్‌హెచ్ తుది జట్టు
ప్యాట్ కమిన్స్(కెప్టెన్), అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, క్లాసెన్, సలీల్ అరోరా(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, స్మరన్ రవిచంద్రన్, శివాంగ్ కుమార్, హర్షల్ పటేల్, ఎషాన్ మలింగ
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: ప్రఫుల్ హింగే, హర్ష్ దూబె, లివింగ్‌స్టోన్, సాకిబ్ హుస్సేన్, జీషాన్ అన్సారీ
కేకేఆర్ తుది జట్టు
అజింక్య రహానె(కెప్టెన్), అంగ్‌క్రిష్ రఘువంశీ(వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, పావెల్, మనీశ్ పాండే, రింకు సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి, వరుణ్ చక్రవర్తి
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: ఫిన్ అలెన్, రమన్‌దీప్ సింగ్, తేజస్వి దాహియా, నవదీప్ సైనీ, టిమ్ సీఫర్ట్
ఇవి కూడా చదవండి:
ఓటమిలోనూ ముంబై ఇండియన్స్ ప్రపంచ రికార్డు
ఇంకెంత దూకుడుగా ఆడాలో తెలియట్లేదు: హార్దిక్