Share News

ఐపీఎల్ 2026: అలా జరిగితే ప్లే ఆఫ్స్‌కు ముంబై ఇండియన్స్!

ABN , Publish Date - May 03 , 2026 | 01:37 PM

ఐపీఎల్ 2026లో ప్లేఆఫ్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘోరంగా ఓడిపోయింది. నిన్న చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓట‌మిపాలై ఎంఐ ప్లేఆఫ్ అవ‌కాశాల‌ను సంక్లిష్టం చేసుకుంది.

ఐపీఎల్ 2026: అలా జరిగితే ప్లే ఆఫ్స్‌కు ముంబై ఇండియన్స్!
Mumbai Indians playoff chances

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘోరంగా ఓడిపోయింది. నిన్న(శ‌నివారం) చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓట‌మిపాలై ఎంఐ ప్లేఆఫ్ అవ‌కాశాల‌ను సంక్లిష్టం చేసుకుంది. ఇప్పటివ‌ర‌కు ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవ‌లం రెండు విజ‌యాలు సాధించిన ముంబై ఇప్పుడు ప్లేఆఫ్ చేర‌డం దాదాపు అసాధ్యమే. అయితే కొన్ని పరిణామాలు చోటుచేసుకుంటే ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశం ఉందని క్రీడా నిపుణులు అంటున్నారు.


మిగిలిన 5 మ్యాచ్‌ల్లో విజ‌యాలు సాధించి.. మిగిలిన జట్ల గెలుపోటములతో ముంబైకి ప్లేఆఫ్ అవ‌కాశాలు ఉంటాయి. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 9 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో, 4 పాయింట్లు సాధించి 9వ స్థానంలో ఉంది. జట్టు నెట్ రన్‌రేట్ (-0.803) కూడా చాలా దారుణంగా ఉంది. ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్ చేరాలంటే కనీసం 14 పాయింట్లు అవసరం. ఒకవేళ ముంబై అదృష్టం క‌లిసివ‌చ్చి ఐదు మ్యాచ్‌లు గెలిచిన‌ప్పటికీ ప్లేఆఫ్స్ చేరాలంటే ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది.


ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లు తమ మిగిలిన మ్యాచ్‌ల్లో ఓడిపోవాలని ముంబై ఇండియన్స్ కోరుకోవాలి. ముంబై త‌మ త‌ర్వాతి మ్యాచ్‌ల్లో భాగంగా సోమ‌వారం ల‌ఖ్‌నవూ సూప‌ర్‌జెయింట్స్‌తో, మే 10న రాయ్‌పూర్ వేదిక‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో, మే 14న పంజాబ్ కింగ్స్‌తో ధర్మశాల్లో, మే 20న‌ కోల్‌క‌తా నైట్ రైడర్స్‌‌తో, మే 24న రాజస్థాన్ రాయ‌ల్స్‌తో తలపడాల్సి ఉంది. గణాంకాల పరంగా అవకాశం ఉన్నప్పటికీ.. ముంబై ప్రస్తుత ఫామ్ చూసుకుంటే మాత్రం అద్భుతం జరిగితే తప్ప ప్లేఆఫ్స్ చేరడం కష్టంమని క్రీడా నిపుణులు అంటున్నారు.


ఇవి కూడా చదవండి

తట్టె ఇడ్లీ.. తయారు చేసుకోండిలా...

కరీంనగర్‌లో కాల్పుల కలకలం.. బంగారు ఆభరణాల దోపిడీ

Updated Date - May 03 , 2026 | 02:10 PM