Share News

ఇంకెంత దూకుడుగా ఆడాలో తెలియట్లేదు: హార్దిక్

ABN , Publish Date - May 03 , 2026 | 11:07 AM

నిన్న చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌ చేతిలో 8 వికెట్ల తేడాతో ముంబై ఓటమి పాలైంది. తమకు ఈ సీజన్ కలిసిరావడం లేదని మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య వెల్లడించాడు.

ఇంకెంత దూకుడుగా ఆడాలో తెలియట్లేదు: హార్దిక్
Mumbai Indians loss

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్‌లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌కు ఈ సీజన్ కలిసిరాలేదు. ఐపీఎల్ 2026లో నిన్న(శనివారం) జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో ముంబై ఘోర ఓటమిని చవిచూసింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ హార్దిక్ పాండ్య తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. ఈ సీజన్ మొత్తం తమ అంచనాలకు చాలా దూరంగా వెళ్లిందని అతడు అంగీకరించాడు. ఇప్పటికే తొమ్మిది మ్యాచ్‌ల్లో ఏడో ఓటమి చవిచూసిన ముంబైకి ప్లేఆఫ్స్ ఆశలు మరింత క్లిష్టంగా మారాయి.


మ్యాచ్ అనంతరం హార్దిక్ మాట్లాడుతూ..' ఈ ఒక్క రోజు మాత్రమే కాదు. మొత్తం సీజన్ మాకు కలిసి రాలేదు. ఇది మాకు మర్చిపోలేని సీజన్‌గా మిగిలింది. సీఎస్‌కే అన్ని విభాగాల్లో మెరుగ్గా ఆడింది. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ అన్ని రంగాల్లో చెన్నై మాకంటే మెరుగ్గా నిలిచింది. మేము ఒకానొక దశలో 180 నుంచి190 పరుగులు చేసేలా కనిపించాము. ఈ పిచ్‌పై అదే మంచి స్కోర్ అవుతుంది. కానీ, అది సాధ్యపడలేదు' అని పాండ్య వెల్లడించాడు.


'మా చేతిలో వికెట్లు ఉన్నా సరే దూకుడుగా ఆడలేకపోయాం. అందుకు చెన్నై బౌలర్ల ప్రతిభే కారణం. సరైన షాట్ల ఎంపిక అవసరం. మేం కూడా బంతితో మరింత దూకుడుగా వ్యవహరించి ఉండాల్సిందని భావిస్తున్నా. కానీ, ఇంకెలా ఉండాలో అర్థం కావడం లేదు. ప్రత్యర్థి బ్యాటర్లను ఔట్ చేయాలంటే అగ్ని గోళాలను విసరాలేమో. మాకున్న బౌలింగ్‌ ఆప్షన్లతో ఇంకాస్త మెరుగ్గా ఆడాలి’ అని హార్దిక్‌ వెల్లడించాడు. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్కే 18.1 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది.


ఇవి కూడా చదవండి..

స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

డచ్ యువరాణుల హత్యలకు కుట్ర.. బయటపడిన నాజీ తరహా ప్లాన్..

Updated Date - May 03 , 2026 | 11:46 AM