ఎస్ఆర్‌హెచ్ vs కేకేఆర్.. ఉప్పల్‌లో గెలుపెవరిది..
ABN , Publish Date - May 03 , 2026 | 10:45 AM
ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుస విజయాలతో జోరుమీదుంది. గత ఐదు మ్యాచ్‌ల్లోనూ పరాజయం అనేదే లేకుండా దూసుకుపోతోంది. ఆదివారం సాయంత్రం జరగబోయే మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది.
ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుస విజయాలతో జోరుమీదుంది. గత ఐదు మ్యాచ్‌ల్లోనూ పరాజయం అనేదే లేకుండా దూసుకుపోతోంది. ఆదివారం సాయంత్రం జరగబోయే మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. కాగా, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు గత మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైంది (SRH vs KKR IPL 2026).
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం సాధారణంగా బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. ఫ్లాట్ ట్రాక్, వేగవంతమైన అవుట్‌ఫీల్డ్ కారణంగా బ్యాటర్లకు రన్స్ చేయడం సులభంగా ఉంటుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్, క్లాసెన్ వంటి హార్డ్ హిట్టర్లు ఆదివారం నాటి మ్యాచ్‌లో చెలరేగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో కూడా భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హోమ్ గ్రౌండ్ మీద ఆడుతుండడం ఎస్‌ఆర్‌హెచ్‌కు మరింత కలిసిరానుంది (Hyderabad pitch report IPL 2026).
ఇక, మొదటి ఆరు మ్యాచ్‌ల్లోనూ ఒక్క విజయం కూడా సాధించలేకపోయిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఆ తర్వాత రెండు విజయాలు సాధించింది. రాజస్థాన్, లక్నోపై గెలిచింది. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి కేవలం రెండింట్లోనే గెలిచింది. ఆదివారం జరగబోయే మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌పై సత్తా చాటాలని కృత నిశ్చయంతో ఉంది. టాప్ ఆర్డర్ ఇప్పటివరకు పెద్దగా రాణించలేదు. అయితే రింకూ సింగ్ ఫామ్‌లోకి తిరిగి రావడం ఒక పెద్ద సానుకూలాంశం. ఇతర బ్యాటర్లు కూడా రాణిస్తేనే కోల్‌కతాకు విజయం సాధ్యమవుతుంది (SRH KKR match preview).
బ్యాటింగ్ విభాగంతో పోల్చుకుంటే కోల్‌కతా బౌలింగ్ కాస్త బలంగా ఉంది (IPL Hyderabad conditions). సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి చక్కగా బౌలింగ్ చేస్తున్నారు. హైదరాబాద్ హార్డ్ హిట్టర్లను నియంత్రించడంలో ఈ ఇద్దరు స్పిన్నర్లు కీలక పాత్ర పోషించాలని కోల్‌కతా కోరుకుంటోంది. ఈ మ్యాచ్‌లో గెలుపు అవకాశాలు హైదరాబాద్ వైపే ఉన్నప్పటికీ.. కోల్‌కతాను కూడా తక్కువగా అంచనా వేయడానికి లేదు.
ఇవి కూడా చదవండి..
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
డచ్ యువరాణుల హత్యలకు కుట్ర.. బయటపడిన నాజీ తరహా ప్లాన్..