Share News

పెను విషాదం.. కారుపై చెట్టు పడి నలుగురు టీచర్ల మృతి..

ABN , Publish Date - May 03 , 2026 | 10:04 AM

రోడ్డుపై వెళుతున్న కారుపై చెట్టు విరిగిపడ్డంతో నలుగురు మహిళా టీచర్లు ప్రాణాలు కోల్పోయారు. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శనివారం చోటుచేసుకుంది.

పెను విషాదం.. కారుపై చెట్టు పడి నలుగురు టీచర్ల మృతి..
kullu accident news

షిమ్లా, మే3: హిమాచల్‌ప్రదేశ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. రోడ్డుపై వెళుతున్న కారుపై చెట్టు విరిగిపడ్డంతో నలుగురు మహిళా టీచర్లు ప్రాణాలు కోల్పోయారు. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల మేరకు.. కులు జిల్లాలోని ఆనీ సబ్ డివిజన్‌లో గత కొన్ని రోజుల నుంచి భారీ ఈదురు గాలులు వీస్తున్నాయి. శనివారం ఆరుగురు మహిళా టీచర్లు స్కూలు నుంచి బొలెరో కారులో ఇంటికి తిరిగి వస్తున్నారు. డ్రైవర్ కారు నడుపుతున్నాడు.


కారు షమ్‌షార్ - గుగ్రా రోడ్డు మీద వేగంగా వెళుతోంది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బాలి ఓల్ ప్రాంతంలో భారీ ఈదురు గాలుల కారణంగా వృక్షం విరిగి వేగంగా వెళుతున్న కారుపై పడింది. కారు నుజ్జునుజ్జైంది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు టీచర్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. కారులోని ఏడుగురిని బయటకు తీసుకువచ్చారు. అందరినీ ఆనీ ఆస్పత్రికి తరలించారు. ఏడుగురిలో నలుగురు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.


మిగిలిన ముగ్గురికి చికిత్స ప్రారంభించారు. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. సహాయక చర్యల్లో పాల్గొన్నారు. చనిపోయిన వారిని స్నేహ్ లతా, బంతి, ఉషా, సీమాగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ విషాద ఘటనపై ముఖ్యమంత్రి సుక్విందర్ సింగ్ సుఖు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు.


ఇవి కూడా చదవండి

ఈ అభిరుచులను ప్రయత్నించండి...

నేటితో ముగియనున్న ద్వారకాతిరుమల చిన్న వెంకన్న బ్రహ్మోత్సవాలు

Updated Date - May 03 , 2026 | 10:28 AM