Share News

ఆ నిబంధనను సవరించి పేసర్లకు వెసులుబాటు కల్పించాలి: సునీల్ గావస్కర్

ABN , Publish Date - May 08 , 2026 | 04:23 PM

టీ20 క్రికెట్ ఫార్మాట్ ఇటీవల కాలంలో పూర్తిగా మారిపోయింది. 20 ఓవర్లలోనే బ్యాటర్లు 250కి పైగా పరుగులు చేయగలుగుతున్నారు. బౌలర్లు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా బ్యాటర్లను ఆపడం కష్టతరమవుతుంది. ఇదే విషయంపై టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ స్పందించాడు.

ఆ నిబంధనను సవరించి పేసర్లకు వెసులుబాటు కల్పించాలి: సునీల్ గావస్కర్
Sunil Gavaskar

ఇంటర్నెట్ డెస్క్: టీ20 క్రికెట్ ఫార్మాట్ ఇటీవల కాలంలో పూర్తిగా మారిపోయింది. 20 ఓవర్లలోనే బ్యాటర్లు 250కి పైగా పరుగులు చేయగలుగుతున్నారు. బౌలర్లు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా బ్యాటర్లను ఆపడం కష్టతరమవుతుంది. ఇదే విషయంపై టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ స్పందించాడు. టీ20 క్రికెట్ వచ్చాక ఆట పూర్తిగా బ్యాటర్ల వైపు మళ్లిందని ఆందోళన వ్యక్తం చేశాడు. బౌండరీలు చిన్నవిగా ఉండటం, ఫీల్డింగ్ పరిమితులు పెరగడం, పవర్‌ఫుల్ బ్యాట్లు రావడం వల్ల బౌలర్ల పరిస్థితి దయనీయంగా మారిందని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో క్రికెట్ నిబంధనల్లో కీలక మార్పులు అవసరమని సూచించాడు. టీమిండియా దిగ్గజం, ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్ సౌరవ్ గంగూలీకి ఈ విషయంపై కీలక విజ్ఞప్తి చేశాడు.


‘బ్యాటర్‌కు ఇలాంటి షాట్ ఆడొద్దని చెప్పలేం కదా! బౌలర్లకు మాత్రం ఎందుకు అన్ని ఆంక్షలు? తదుపరి ఐసీసీ సమావేశంలో బౌలర్ల పరిస్థితిపై కూడా ఆలోచించండి. బౌన్సర్ వైడ్ నిబంధనను సవరించి పేసర్లకు కొంత వెసులుబాటు కల్పించాలి. బౌలర్ వేసిన బౌన్సర్ బ్యాటర్ తలకు కొద్దిగా ఎత్తుకు వెళ్లినా అది ‘వైడ్’గా ప్రకటిస్తున్నారు. ఇది పేసర్‌ను ఒక చేతిని కట్టేసి బౌలింగ్ చేయమన్నట్లే ఉంటుంది. బౌలర్లకు కూడా కొంత స్వేచ్ఛ ఇవ్వాలి. బ్యాటర్ సాధారణ స్టాన్స్ కంటే ఒక అడుగు ఎత్తులో వెళ్లే బంతిని వైడ్‌గా పరిగణించకుండా ఉంటే పేసర్లకు కాస్త ఉపశమనం లభిస్తుంది’ అని గంగూలీని గావస్కర్ కోరాడు.


ఇవి కూడా చదవండి:

టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్!

లఖ్‌నవూ చేతిలో ఓటమిపై స్పందించిన ఆర్సీబీ కెప్టెన్ రజత్

Updated Date - May 08 , 2026 | 04:24 PM