ఐపీఎల్ 2026: జట్టుతో కలిసిన ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్య
ABN , Publish Date - May 08 , 2026 | 03:10 PM
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ జట్టు అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. అయితే ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్య లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌కు గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. కాగా బెంగళూరుతో జరిగే కీలక పోరుకు పాండ్య బరిలోకి దిగే అవకాశం ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ జట్టు అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. అయితే ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్య లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌కు గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేశాడు. అయితే మే 10న రాయ్‌పూర్ వేదికగా ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు కూడా హార్దిక్ అందుబాటులో ఉండబోడని ప్రచారం జరిగింది. కానీ బెంగళూరుతో జరిగే కీలక పోరుకు పాండ్య బరిలోకి దిగే అవకాశం ఉంది. రాయ్‌పూర్‌కు చేరుకుని పాండ్య జట్టుతో కలిశాడు. ఈ మేరకు ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
ఎంఐ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు పది మ్యాచ్‌లు ఆడి కేవలం మూడింట్లోనే గెలిచింది. 6 పాయింట్లతో పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. కెప్టెన్‌గా, ప్లేయర్‌గా విఫలమవుతూ వస్తోన్న హార్దిక్ పాండ్యపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎల్ఎస్‌జీతో జరిగిన మ్యాచ్‌లో వెన్ను నొప్పి కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఆ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేశాడు. రోహిత్ శర్మ దూకుడు నాక్‌తో వరుస ఓటముల తర్వాత ఎంఐ విజయం సాధించింది. దీంతో హార్దిక్‌ను తప్పించి సూర్యనే కెప్టెన్‌గా కొనసాగించాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో పాండ్య జట్టుకు దూరంగా ఉంటాడనే ప్రచారమూ జరిగింది. ఈ నేపథ్యంలో హార్దిక్ తిరిగి జట్టుతో కలవడంతో ఆ ఊహాగానాలకు చెక్ పడినట్లు అయింది. ఇదిలా ఉంటే, ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే ఇప్పటి నుంచి ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ గెలిచి తీరాలి. దాంతోపాటు ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడక తప్పదు.
ఇవి కూడా చదవండి:
టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్!
లఖ్‌నవూ చేతిలో ఓటమిపై స్పందించిన ఆర్సీబీ కెప్టెన్ రజత్