టీ20 ప్రపంచ కప్ ఫైనల్ నుంచి వాళ్ళిద్దరినీ తప్పించండి: సునీల్ గావస్కర్
ABN , Publish Date - Mar 08 , 2026 | 04:57 PM
టీ20 ప్రపంచ కప్ ఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో న్యూజిలాండ్-భారత్ జట్లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ టీమిండియాకు పలు కీలక సూచనలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ ఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో న్యూజిలాండ్-భారత్ జట్లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా తలపడనున్నాయి. అయితే ప్రస్తుతం అందరి ఆందోళన అంతా.. స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఫామ్ గురించే! ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ టీమిండియాకు పలు కీలక సూచనలు చేశాడు.
‘ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ ప్రపంచలోనే నంజ1 బ్యాటర్. కానీ ప్రస్తుతం ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటి వరకు చేసిన తప్పిదాల నుంచి కూడా అతడు ఏమీ నేర్చుకోలేదు. ప్రతిసారీ ఒకేలాంటి షాట్లు ఆడుతూ పెవిలియన్‌కు చేరుతున్నాడు. బౌలర్లు అతడిని టార్గెట్ చేసి విజయం సాధిస్తున్నారు. కఠిన నిర్ణయమైనా అతడిని తప్పించక తప్పదు. ఇషాన్ కిషన్, సంజు శాంసన్‌తో ఫైనల్‌లో ఓపెనింగ్ చేయించాలి.
ఇక వరుణ్ చక్రవర్తి విషయానికొస్తే.. ప్రస్తుతం అతడు పూర్తి ఆత్మవిశ్వాసం కనిపించం లేదు. సూపర్ 8 నుంచి అతడు ధారాళంగా పరుగులు ఇచ్చేస్తున్నాడు. నరేంద్ర మోదీ స్టేడియంలో బౌండరీలు చాలా పెద్దగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో కుల్‌దీప్ యాదవ్ మంచి ఎంపిక. వరుణ్ చక్రవర్తిని తప్పించి కుల్‌దీప్‌ను తీసుకోవాలి. అతడు ఫ్లాట్ పిచ్‌ల మీద కూడా బంతిని తిప్పగలడు’ అని సునీల్ గావస్కర్ విశ్లేషించాడు.
ఇవి కూడా చదవండి:
254 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. కివీస్ బౌలర్ అరుదైన రికార్డ్
అహ్మదాబాద్ పిచ్.. టీమిండియా ఆందోళన పడుతోందా..