Share News

టీ20 ప్రపంచ కప్ ఫైనల్: అహ్మదాబాద్‌కు చేరుకున్న ఎం.ఎస్ ధోనీ

ABN , Publish Date - Mar 08 , 2026 | 03:33 PM

టీ20 ప్రపంచ కప్ 2026 కీలక పోరుకు సిద్ధమైంది. నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్-భారత్ జట్లు ఫైనల్‌లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ అహ్మదాబాద్ చేరుకున్నారు.

టీ20 ప్రపంచ కప్ ఫైనల్: అహ్మదాబాద్‌కు చేరుకున్న ఎం.ఎస్ ధోనీ
MS Dhoni

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 కీలక పోరుకు సిద్ధమైంది. నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్-భారత్ జట్లు ఫైనల్‌లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ అహ్మదాబాద్ చేరుకున్నారు. అయితే ఇటీవల ఇంగ్లండ్‌తో ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన సెమీ ఫైనల్ 2 మ్యాచ్‌ను భార్య సాక్షితో కలిసి వీక్షించిన విషయం తెలిసిందే.


టీమిండియా ధోనీ కెప్టెన్సీలో 2007లో పాకిస్థాన్‌ను ఓడించి తొలి టీ20 ప్రపంచ కప్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తిరిగి 2024లో రోహిత్ శర్మ సారథ్యంలో దాదాపు 17 ఏళ్ల తర్వాత భారత జట్టు ఈ ట్రోఫీని ముద్దాడింది. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో టీమిండియా టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్‌కు చేరుకుంది. ఈ తుది పోరులోనూ భారత్ విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మిస్టర్ కూల్ అహ్మదాబాద్ చేరుకోవడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.


ఇవి కూడా చదవండి:

254 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. కివీస్ బౌలర్ అరుదైన రికార్డ్

అహ్మదాబాద్ పిచ్.. టీమిండియా ఆందోళన పడుతోందా..

Updated Date - Mar 08 , 2026 | 05:40 PM