Share News

టీ20 ప్రపంచ కప్: అహ్మదాబాద్‌లో తుది సమరం.. వర్షానికి అవకాశమే లేదు!

ABN , Publish Date - Mar 08 , 2026 | 04:06 PM

టీ20 ప్రపంచ కప్ 2026 ఆఖరి అంకానికి చేరుకుంది. ఈరోజు రాత్రి 7 గంటల నుంచి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్-భారత జట్లు తలపడనున్నాయి. అయితే వాతావరణ శాఖ నివేదిక ప్రకారం ఈ రోజు అహ్మదాబాద్‌లో వర్షం కురిసే అవకాశం దాదాపు లేదు.

టీ20 ప్రపంచ కప్: అహ్మదాబాద్‌లో తుది సమరం.. వర్షానికి అవకాశమే లేదు!
T20 World Cup

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 ఆఖరి అంకానికి చేరుకుంది. ఈరోజు రాత్రి 7 గంటల నుంచి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్-భారత జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకున్న టీమిండియా.. ఈ తుది పోరులోనూ విజయం సాధించాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరి ఈ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగిస్తే..!


ఒకవేళ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగిస్తే రిజర్వ్ డే ఉంటుంది. కానీ వాతావరణ శాఖ నివేదిక ప్రకారం ఈ రోజు అహ్మదాబాద్‌లో వర్షం కురిసే అవకాశం దాదాపు లేదు. ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది. సాయంత్రం 6 గంటల సమయంలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండనుంది. అర్ధరాత్రి ఉష్ణోగ్రతలు 28 నుంచి 27 డిగ్రీలకు పడిపోవచ్చు. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశముంది. అయితే ఈ పరిస్థితి పవర్ ప్లేను ప్రభావితం చేసే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి:

254 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. కివీస్ బౌలర్ అరుదైన రికార్డ్

అహ్మదాబాద్ పిచ్.. టీమిండియా ఆందోళన పడుతోందా..

Updated Date - Mar 08 , 2026 | 04:06 PM