ఐపీఎల్ 2026: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డ్..
ABN , Publish Date - Apr 12 , 2026 | 09:01 PM
ఐపీఎల్ చరిత్రలోనే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై జరిగిన మ్యాచ్‌లో గిల్ 4000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ చరిత్రలోనే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై జరిగిన మ్యాచ్‌లో గిల్ 4000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. ఐపీఎల్‌లో 4వేల పరుగులు సాధించిన అతిపిన్న వయస్కుడిగా గిల్ నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. ఈ 4వేల ఐపీఎల్ పరుగులు సాధించిన నాటికి గిల్ వయసు 26 ఏళ్ల 216 రోజులు కాగా.. కోహ్లీ ఈ ఫీట్ అందుకున్న నాటికి అతడి వయసు 27 ఏళ్ల 195 రోజులు. దీంతో ఐపీఎల్‌లో అరుదైన రికార్డును అందుకున్న గిల్.. కోహ్లీ పేరిట ఉన్న రికార్డును కూడా బ్రేక్ చేశాడు.
మరో ఘనత..
ఇదిలా ఉండగా, అత్యంత వేగంగా ఈ 4వేల పరుగుల మార్క్‌ను అందుకున్న ఆటగాళ్ల జాబితాలో గిల్ ఐదో స్థానంలో నిలిచాడు. గిల్ ఈ మైలురాయిని 118 ఇన్నింగ్స్‌లో అందుకున్నాడు. కేఎల్ రాహుల్(105), క్రిస్ గేల్(112), డేవిడ్ వార్నర్(114), బట్లర్(116) ఇన్నింగ్స్‌ల్లో ఈ అరుదైన ఘనతను అందుకున్నారు. అయితే ఈ జాబితాలో గిల్ రెండో భారత ప్లేయర్‌గా నిలిచాడు. అగ్రస్థానంలో స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. గిల్ తర్వాత సురేశ్ రైనా, ధోని, సంజు శాంసన్ ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
ఆ విషయంలో ముంబై ఇండియన్స్ తుస్సు: అశ్విన్
ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్.. భారత్‌కు రజతం