ఐపీఎల్ 2026: జురెల్, పరాగ్ హాఫ్ సెంచరీలు.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
ABN , Publish Date - May 17 , 2026 | 09:30 PM
ఐపీఎల్ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. ఢిల్లీకి 194 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. ఢిల్లీకి 194 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కెప్టెన్ రియాన్ పరాగ్(51; 26 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు), వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్(53; 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
వైభవ్ సూర్యవంశీ(46; 21 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) తృటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. యశస్వి జైస్వాల్(12), ఫెర్రీరా(0), రవి సింగ్(4), శుభమ్ దూబె(5), డాసున్ శనక(10) విఫలమయ్యారు. జోఫ్రా ఆర్చర్(2*), ఆడమ్ మిల్నే(2*) నాటౌట్‌గా నిలిచారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4 వికెట్లతో చెలరేగాడు. లుంగి ఎంగిడి 2, మాధవ్ తివారి 2 వికెట్లు పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు
సీఎస్కే-ఎస్ఆర్‌హెచ్: ధోని ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకనున్నాడా?