ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్ నిర్వహించండి.. కేంద్రానికి సీటీఐ ఛైర్మన్ లేఖ
ABN , Publish Date - May 17 , 2026 | 06:16 PM
ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లను ప్రేక్షకులు లేకుండా కొన్ని వేదికల్లోనే నిర్వహించాలని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ(సీటీఐ) ఛైర్మన్ బ్రిజేశ్ గోయల్ కోరారు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 కీలక దశకు చేరుకుంది. మే 24తో లీగ్ స్టేజ్ మ్యాచ్‌లు ముగియనున్నాయి. ప్లే ఆఫ్స్ బెర్తుల కోసం పోటీ రసవత్తరంగా మారుతోన్న సమయంలో.. ఐపీఎల్ అభిమానులకు ఓ షాకింగ్ న్యూస్ వచ్చింది. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లను ప్రేక్షకులు లేకుండా కొన్ని వేదికల్లోనే నిర్వహించాలని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ(సీటీఐ) ఛైర్మన్ బ్రిజేశ్ గోయల్ కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు లేఖ రాశారు.
పశ్చిమాసియా సంక్షోభం దృష్ట్యా ఇంధన కొరత ఏర్పడ్డ కారణంగా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ‘మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌లకు కొత్త షెడ్యూల్ రూపొందించాలి. కొన్ని స్టేడియాల్లోనే మ్యాచ్‌లను నిర్వహించాలి. దీనివల్ల లక్షల లీటర్ల పెట్రోల్, డిజీల్ ఆదా అవుతాయి. జట్ల నిరంతర రాకపోకల వల్ల విమాన ఇంధన(ఏటీఎఫ్) నిల్వలపై పడే భారాన్ని కూడా తగ్గించే అవకాశం ఉంటుంది’ అని గోయల్ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2026లో మే 16 వరకు 60 మ్యాచ్‌లు జరిగాయి. లీగ్ స్టేజ్‌లో మరో 10 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. తర్వాత నాలుగు ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు జరుగుతాయి. మే 26న తొలి క్వాలిఫయర్‌కు ధర్మశాల ఆతిథ్యమివ్వనుంది. ఎలిమినేటర్(మే 27), క్వాలిఫయర్-2 మ్యాచ్(మే 29) ఛండీగడ్‌లో జరగనున్నాయి. మే 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఫైనల్ మ్యాచ్‌కు వేదిక కానుంది.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు
సీఎస్కే-ఎస్ఆర్‌హెచ్: ధోని ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకనున్నాడా?