ఐపీఎల్ 2026: ఆర్సీబీ భారీ స్కోర్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
ABN , Publish Date - May 17 , 2026 | 05:19 PM
ఐపీఎల్ 2026లో భాగంగా ధర్మశాల వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. పంజాబ్‌కు 223 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ధర్మశాల వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. పంజాబ్‌కు 223 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. విరాట్ కోహ్లీ(58; 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), వెంకటేశ్ అయ్యర్(73*; 40 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో చెలరేగాడు.
వెంకటేశ్ అయ్యర్ కెరీర్‌లో ఇది 13వ హాఫ్ సెంచరీ కాగా, ఈ సీజన్‌లో తొలి అర్ధశతకం కావడం విశేషం. వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకుని జట్టుకు భారీ స్కోర్ అందించడంలో వెంకటేశ్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. బెథెల్(11) మరోసారి విఫలమయ్యారు. దేవదత్ పడిక్కల్(45; 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), టిమ్ డేవిడ్(28; 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రీజులో ఉన్నంత సేపు దూకుడుగా ఆడారు. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ 2, అర్ష్‌దీప్ సింగ్, చాహల్ తలొక వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: ఆర్సీబీతో కీలక పోరు.. టాస్ నెగ్గిన పంజాబ్ కింగ్స్
థాయ్‌లాండ్ ఓపెన్ 2026: ఫైనల్లో భారత్ ఓటమి