ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్‌కు మరో ఓటమి.. ప్లే ఆఫ్స్‌కు ఆర్సీబీ
ABN , Publish Date - May 17 , 2026 | 07:30 PM
ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొడుతోంది. అద్భుతమైన ప్రదర్శనలతో ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొడుతోంది. అద్భుతమైన ప్రదర్శనలతో ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 223 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్.. పూర్తిగా తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 199 పరుగులకే పరిమితమైంది. దీంతో ఆర్సీబీ 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. శశాంక్ సింగ్(56) హాఫ్ సెంచరీ చేసినా పంజాబ్‌కు ఓటమి తప్పలేదు.
కూపర్ కనోలీ(37), సూర్యాంశ్(35), స్టోయినిస్(37), అజ్మతుల్లా(14) పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. ప్రియాంశ్ ఆర్య(0), ప్రభ్‌సిమ్రన్ సింగ్(2), శ్రేయస్ అయ్యర్(1) తీవ్రంగా విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో రసిక్ సలామ్ దార్ 3, భువనేశ్వర్ కుమార్ 2, హేజిల్‌వుడ్, సుయాశ్ శర్మ, షెఫర్డ్ తలొక వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో ఆర్సీబీ 18 పాయింట్లతో ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. మరోవైపు పంజాబ్ కింగ్స్‌కు ఇది వరుసగా ఆరో ఓటమి కావడం గమనార్హం.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(58; 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), వెంకటేశ్ అయ్యర్(73*; 40 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. బెథెల్(11) మరోసారి విఫలమయ్యాడు. దేవదత్ పడిక్కల్(45; 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), టిమ్ డేవిడ్(28; 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రీజులో ఉన్నంత సేపు దూకుడుగా ఆడారు. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ 2, అర్ష్‌దీప్ సింగ్, చాహల్ తలొక వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు
సీఎస్కే-ఎస్ఆర్‌హెచ్: ధోని ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకనున్నాడా?