ఐపీఎల్ 2026: రాజస్థాన్ రాయల్స్‌తో పోరు.. టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్
ABN , Publish Date - May 17 , 2026 | 07:13 PM
ఐపీఎల్ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఢిల్లీ.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో రాజస్థాన్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఢిల్లీ.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో రాజస్థాన్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఇరుజట్లకూ ఈ మ్యాచ్ అత్యంత కీలకం. 11 మ్యాచుల్లో ఆరు విజయాలతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. మరోవైపు 12 మ్యాచుల్లో ఐదు విజయాలతో ఢిల్లీ 8వ స్థానంలో ఉంది. ఈ ఇరు జట్లు ఈ సీజన్‌లో తలపడ్డాయి. ఆ పోరులో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరి రాజస్థాన్ ఇప్పుడు రివేంజ్ తీర్చుకుంటుందా? అనేది చూడాల్సి ఉంది.
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు
అక్షర్ పటేల్(కెప్టెన్), కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), అభిషేక్ పొరెల్, సాహిల్ ఫరాఖ్, స్టబ్స్, డేవిడ్ మిల్లర్, మాధవ్ తివారి, త్రిపురన విజయ్, లుంగి ఎంగిడి, స్టార్క్, ముకేశ్ కుమార్
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: అశుతోశ్ శర్మ, సమీర్ రిజ్వి, విప్రజ్ నిగమ్, పాతుమ్ నిశాంక, కరుణ్ నాయర్
రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు
రియాన్ పరాగ్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రవి సింగ్, డొనొవాన్ ఫెర్రీరా, శుభమ్ దూబె, జోఫ్రా ఆర్చర్, ఆడమ్ మిల్నే, బ్రిజేశ్ శర్మ, యశ్ రాజ్ పుంజా
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: డాసున్ శనక, ప్రిటోరియస్, రవి బిష్ణోయ్, సుశాంత్ మిశ్రా, అమన్ రావ్ పెరాలా
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు
సీఎస్కే-ఎస్ఆర్‌హెచ్: ధోని ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకనున్నాడా?