ఐపీఎల్ 2026: గుజరాత్ టైటాన్స్‌తో పోరు.. టాస్ నెగ్గిన ఆర్సీబీ
ABN , Publish Date - Apr 24 , 2026 | 07:14 PM
ఐపీఎల్ 2026లో భాగంగా నేడు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఆర్సీబీ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత గుజరాత్ జట్టు బ్యాటింగ్ చేయనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా నేడు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఆర్సీబీ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత గుజరాత్ జట్టు బ్యాటింగ్ చేయనుంది. కాగా ఆర్సీబీకి ఇదే ఆఖరి హోం గ్రౌండ్ మ్యాచ్. దీని తర్వాత ఆడనున్న మ్యాచ్‌లన్నీ బెంగళూరు బయటే ఉండనున్నాయి. ఇదిలా ఉండగా, ఆడిన ఆరు మ్యాచుల్లో నాలుగు గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఆరు మ్యాచుల్లో మూడు గెలిచిన జీటీ.. ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఈ పోరులో ఎవరు విజయం సాధించనున్నారో చూడాల్సి ఉంది.
ఆర్సీబీ తుది జట్టు
రజత్ పాటీదార్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, హేజిల్‌వుడ్, సుయాశ్ శర్మ, రసిక్ సలామ్ దార్
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: జాకబ్ బెథెల్, కాక్స్, మంగేశ్ యాదవ్, విక్కీ, వెంకటేశ్ అయ్యర్
గుజరాత్ టైటాన్స్ తుది జట్టు
శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, బట్లర్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షారుఖ్ ఖాన్, జోసన్ హోల్డర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మానవ్ సుతార్, రబాడా, సిరాజ్
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: ప్రసిద్ధ్ కృష్ణ, అనుజ్ రావత్, ఫిలిప్స్, నిశాంత్ సింధు, అర్షద్ ఖాన్
ఇవి కూడా చదవండి:
సీఎస్కే చేతిలో ఘోర ఓటమిపై స్పందించిన హార్దిక్
మెరుపు సెంచరీ.. సంజు ఖాతాలోకి పలు రికార్డులు!