Share News

సాల్ట్, కోహ్లీ, పాటీదార్ హాఫ్ సెంచరీలు.. ముంబై ఇండియన్స్ టార్గెట్ 241

ABN , Publish Date - Apr 12 , 2026 | 09:39 PM

ఐపీఎల్ 2026లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ.. విధ్వంసం సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఏకంగా 240 పరుగులు చేసింది.

సాల్ట్, కోహ్లీ, పాటీదార్ హాఫ్ సెంచరీలు.. ముంబై ఇండియన్స్ టార్గెట్ 241
RCB vs MI

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ.. విధ్వంసం సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఏకంగా 240 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్‌కు 241 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆర్సీబీ టాప్ 3 బ్యాటర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటీదార్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు.


ఫిల్ సాల్ట్(78; 36 బంతుల్లో 6 సిక్స్‌లు, 6 ఫోర్లు), విరాట్ కోహ్లీ(50; 38 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), రజత్ పాటీదార్(53; 20 బంతుల్లో 5 సిక్సర్లు, 4 ఫోర్లు)తో అదరగొట్టారు. జితేశ్ శర్మ(10) విఫలమయ్యాడు. టిమ్ డేవిడ్(34*), షెఫర్డ్(2*) నాటౌట్‌గా నిలిచారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో బౌల్ట్, హార్దిక్ పాండ్య, శాంట్నర్, శార్దూల్ ఠాకూర్ తలొక వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

ఆ విషయంలో ముంబై ఇండియన్స్ తుస్సు: అశ్విన్

ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్.. భారత్‌కు రజతం

Updated Date - Apr 12 , 2026 | 09:40 PM