ఐపీఎల్ 2026: సూర్యాంశ్ హాఫ్ సెంచరీ.. గుజరాత్ టైటాన్స్ టార్గెట్ ఎంతంటే?
ABN , Publish Date - May 03 , 2026 | 09:38 PM
ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. గుజరాత్‌కు 164 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. గుజరాత్‌కు 164 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పంజాబ్ బ్యాటర్ సూర్యాంశ్(57) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. గుజరాత్ బౌలర్ల జాసన్ హోల్డర్ 4 వికెట్లతో విజృంభించాడు.
పంజాబ్ బ్యాటర్లలో స్టోయినిస్(40) రాణించాడు. మిగతా బ్యాటర్లంతా స్వల్ప పరుగులకే పెవిలియన్ చేరారు. ప్రియాంశ్ ఆర్య(2), ప్రభ్‌సిమ్రన్ సింగ్(15), కూపర్ కనోలి(0), శ్రేయస్ అయ్యర్(19), నేహాల్ వధేరా(0), యాన్సెన్(20), బార్ట్‌లెట్(0) వెనువెంటనే ఔటయ్యారు. విజయకుమార్ వైశాఖ్(1*), అర్ష్‌దీప్ సింగ్(1*) నాటౌట్‌గా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో హోల్డర్ 4, సిరాజ్ 2, రబాడా 2, రషీద్ ఖాన్ 1 వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
వైభవ్ ‘అన్‌ప్రొఫెషనల్’ అంటూ వ్యాఖ్య.. విమర్శలపై స్పందించిన జితేశ్ శర్మ
ధోనిలా ‘గన్‌షాట్’ సంబరాలు చేసుకోవాలని ముందే అనుకున్నా: కార్తిక్ శర్మ