Share News

ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్.. టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్

ABN , Publish Date - May 03 , 2026 | 07:23 PM

ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన గుజరాత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.

ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్.. టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్
GT vs PBKS

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన గుజరాత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. గత మ్యాచ్‌లో తొలి ఓటమిని చవి చూసిన పంజాబ్.. ఈ మ్యాచ్‌లో గెలవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ఆర్సీబీని ఓడించి దూకుడు మీదున్న గుజరాత్.. రెట్టింపు ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. ఇదిలా ఉండగా, ఆడిన 8 మ్యాచుల్లో 6 గెలిచి 13 పాయింట్లతో పంజాబ్ కింగ్స్ అగ్రస్థానంలో ఉంది. 9 మ్యాచుల్లో 5 గెలిచిన గుజరాత్.. ఐదో స్థానంలో కొనసాగుతోంది.


పంజాబ్ కింగ్స్ తుది జట్టు

శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), ప్రభ్‌సిమ్రన్ సింగ్(వికెట్ కీపర్), ప్రియాంశ్ ఆర్య, కూపర్ కనోలి, స్టోయినిస్, సూర్యాంశ్, నేహాల్ వధేరా, యాన్సెన్, బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, చాహల్

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: హర్పీత్ బ్రార్, విష్ణు వినోద్, విజయకుమార్ వైశాఖ్, ముషీర్ ఖాన్, మిచెల్ ఓవెన్


గుజరాత్ టైటాన్స్ తుది జట్టు

శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, బట్లర్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నిశాంత్ సింధు, హోల్డర్, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, రబాడా, సిరాజ్, మానవ్ సుతార్

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: రాహుల్ తెవాటియా, ఫిలిప్స్, అనుజ్ రావత్, కుల్వంత్, కుమార్ కుషాగ్రా


ఇవి కూడా చదవండి:

వైభవ్‌ ‘అన్‌ప్రొఫెషనల్’ అంటూ వ్యాఖ్య.. విమర్శలపై స్పందించిన జితేశ్ శర్మ

ధోనిలా ‘గన్‌షాట్’ సంబరాలు చేసుకోవాలని ముందే అనుకున్నా: కార్తిక్ శర్మ

Updated Date - May 03 , 2026 | 07:23 PM