Share News

ఐపీఎల్ 2026: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆలౌట్.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?

ABN , Publish Date - May 03 , 2026 | 05:21 PM

ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లు తడబడ్డారు. 19 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌట్ అయ్యారు. కేకేఆర్‌కు 166 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.

ఐపీఎల్ 2026: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆలౌట్.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?
SRH vs KKR

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లు తడబడ్డారు. 19 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌట్ అయ్యారు. కేకేఆర్‌కు 166 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. కేకేఆర్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేసి సన్‌రైజర్స్ బ్యాటర్లను కట్టడి చేశారు. హైదరాబాద్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్(61) హాఫ్ సెంచరీ చేశాడు. అతడు మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు.


ట్రావిస్ హెడ్(61; 28 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఇషాన్ కిషన్(42; 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అభిషేక్ శర్మ(15), క్లాసెన్(11), స్మరన్ రవిచంద్రన్(4), అనికేత్ వర్మ(6), సలీల్ అరోరా(2), ప్యాట్ కమిన్స్(10), శివాంగ్ కుమార్(1), హర్షల్ పటేల్(6) స్వల్ప పరుగులకే పెవిలియన్ చేరారు. ఎషాన్ మలింగ(2*) నాటౌట్‌గా నిలిచాడు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, సునీల్ నరైన్ 2, కార్తిక్ త్యాగి 2, వైభవ్ అరోరా 1, గ్రీన్ 1, అనుకుల్ రాయ్ ఒక వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

వైభవ్‌ ‘అన్‌ప్రొఫెషనల్’ అంటూ వ్యాఖ్య.. విమర్శలపై స్పందించిన జితేశ్ శర్మ

ధోనిలా ‘గన్‌షాట్’ సంబరాలు చేసుకోవాలని ముందే అనుకున్నా: కార్తిక్ శర్మ

Updated Date - May 03 , 2026 | 05:26 PM