ఐపీఎల్ 2026: హైదరాబాద్ దూకుడుకు చెక్.. ఎస్ఆర్‌హెచ్‌పై కేకేఆర్ విజయం
ABN , Publish Date - May 03 , 2026 | 07:10 PM
ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఎస్ఆర్‌హెచ్ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి 18.2 ఓవర్లలోనే ఛేదించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఎస్ఆర్‌హెచ్ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి 18.2 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో హైదరాబాద్ వరుస విజయాలకు బ్రేక్ పడినట్లు అయింది. అంగ్‌క్రిష్ రఘువంశీ(59) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అజింక్య రహానె(43) రాణించాడు. కేకేఆర్ బ్యాటర్ల దూకుడును హైదరాబాద్ బౌలర్లు కట్టడి చేయలేకపోయారు.
ఫిన్ అలెన్(29) పర్వాలేదనిపించాడు. రింకు సింగ్(22*), గ్రీన్(3*) నాటౌట్‌గా నిలిచారు. హైదరాబాద్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్, శివాంగ్ కుమార్, సాకిబ్ హుస్సేన్ తలొక వికెట్ పడగొట్టారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లు తడబడ్డారు. 19 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌట్ అయ్యారు. కేకేఆర్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేసి సన్‌రైజర్స్ బ్యాటర్లను కట్టడి చేశారు.
ట్రావిస్ హెడ్(61; 28 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఇషాన్ కిషన్(42; 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అభిషేక్ శర్మ(15), క్లాసెన్(11), స్మరన్ రవిచంద్రన్(4), అనికేత్ వర్మ(6), సలీల్ అరోరా(2), ప్యాట్ కమిన్స్(10), శివాంగ్ కుమార్(1), హర్షల్ పటేల్(6) స్వల్ప పరుగులకే పెవిలియన్ చేరారు. ఎషాన్ మలింగ(2*) నాటౌట్‌గా నిలిచాడు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, సునీల్ నరైన్ 2, కార్తిక్ త్యాగి 2, వైభవ్ అరోరా 1, గ్రీన్ 1, అనుకుల్ రాయ్ ఒక వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
వైభవ్ ‘అన్‌ప్రొఫెషనల్’ అంటూ వ్యాఖ్య.. విమర్శలపై స్పందించిన జితేశ్ శర్మ
ధోనిలా ‘గన్‌షాట్’ సంబరాలు చేసుకోవాలని ముందే అనుకున్నా: కార్తిక్ శర్మ