Share News

షో చేయడానికే పనికొస్తారు.. వైభవ్‌కు ఆయూబ్ సెండాఫ్‌పై పాక్ మాజీ క్రికెటర్ ఫైర్

ABN , Publish Date - Oct 04 , 2026 | 02:41 PM

వైభవ్ సూర్యవంశీని పాకిస్థాన్ ఆల్‌రౌండర్ సైమ్ ఆయూబ్ ఔట్ చేసిన తర్వాత చేసిన సెలబ్రేషన్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్, బ్యాటర్ కమ్రాన్ అక్మల్ తీవ్రంగా స్పందించాడు.

షో చేయడానికే పనికొస్తారు.. వైభవ్‌కు ఆయూబ్ సెండాఫ్‌పై పాక్ మాజీ క్రికెటర్ ఫైర్
Kamran Akmal

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడలు-2026లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన క్రికెట్ ఫైనల్‌లో ఓ ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. భారత యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని పాకిస్థాన్ ఆల్‌రౌండర్ సైమ్ ఆయూబ్ ఔట్ చేసిన తర్వాత చేసిన సెలబ్రేషన్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. 15 ఏళ్ల వైభవ్‌ను ఉద్దేశిస్తూ సైమ్ ‘బేబీ ఇన్ ది క్రెడిల్’ తరహా సైగలు చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్, బ్యాటర్ కమ్రాన్ అక్మల్ తీవ్రంగా స్పందించాడు. ఆధునిక క్రికెటర్లు ఆటపై దృష్టి పెట్టడం కంటే సోషల్ మీడియా కోసం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించాడు.


‘ఇలాంటివి చాలా కాలంగా జరుగుతున్నాయి. మన ప్రదర్శన అంత గొప్పగా లేదు. కానీ సోషల్ మీడియాలో షో కోసం మాత్రం ఇలాంటి పనులు చేస్తున్నాం. మేనేజ్‌మెంట్ దీనిపై ఆలోచించాలి. ఇది అంతర్జాతీయ క్రికెట్. అతడు 15 ఏళ్ల వాడైనా.. అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న ఆటగాడే. సైమ్ ఆయూబ్ చిన్న పిల్లాడు కాదు. అతను తన ప్రదర్శనపై దృష్టి పెట్టాలి’ అని అక్మల్ అన్నాడు.


అసలేం జరిగిందంటే?

పాకిస్థాన్‌తో ఫైనల్ పోరులో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. మూడో ఓవర్‌లో సైమ్ ఆయూబ్ బౌలింగ్‌లో వైభవ్ సూర్యవంశీ వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ఈ క్రమంలో సైమ్.. ‘చిన్న పిల్లాడివి’ అన్నట్లు చేతులతో ఊయల ఊపుతున్నట్లు సైగలు చేశాడు. వైభవ్ మాత్రం ఏం పట్టించుకోకుండా డకౌట్ వెళ్లిపోయాడు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారత్‌పై ఇలాంటి ప్రవర్తన చూపించిన ఏ మ్యాచ్ పాకిస్థాన్ గెలవలేదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


ఇవి కూడా చదవండి:

కోల్‌కతాలో బ్రెజిల్ ఫుట్‌బాల్ ఫీవర్.. భారత్‌తో మ్యాచ్‌కు సాల్ట్ లేక్ స్టేడియం సిద్ధం

ఆసియా క్రీడల్లో భారత్ సత్తా.. మలేషియాపై 5-1 ఘన విజయం, హాకీలో స్వర్ణం..

Updated Date - Oct 04 , 2026 | 02:41 PM