విండీస్‌కు ఓదార్పు
ABN , Publish Date - Oct 04 , 2026 | 06:07 AM
భారత్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో వెస్టిండీస్ ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. కెప్టెన్ షాయ్ హోప్ (143 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్సర్లతో 162 నాటౌట్) అజేయ అద్భుత...
మూడో వన్డేలో గెలుపు
హోప్ అజేయ శతకం
రాహుల్ సెంచరీ వృథా
ముల్లన్‌పూర్: భారత్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో వెస్టిండీస్ ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. కెప్టెన్ షాయ్ హోప్ (143 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్సర్లతో 162 నాటౌట్) అజేయ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో శనివారం జరిగిన ఆఖరిదైన మూడో మ్యాచ్‌లో విండీస్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే ఇప్పటికే రెండు వన్డేలు గెలిచిన గిల్ సేన సిరీస్‌ను 2-1తో దక్కించుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 351 పరుగులు చేసింది. రాహుల్ (87 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 129 నాటౌట్), రోహిత్ శర్మ 85 బంతు ల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 92), రుతురాజ్ (57), నమన్ ధిర్ (30) అదరగొట్టారు. ఆ తర్వాత భారీ ఛేదనలో ఆత్మవిశ్వాసంతో ఆడిన విండీస్ 48.2 ఓవర్లలో 5 వికెట్లకు 352 పరుగులు చేసి నెగ్గింది. షాయ్ హోప్ ఓపెనర్‌గా బరిలోకి దిగి ఆద్యంతం అండగా నిలిచాడు. అతడికి జాంగూ (67), కీమో పాల్ (44) సహకరించారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా హోప్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా గిల్ నిలిచారు.
రాహుల్, రోహిత్ జోరు: టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ను ఆరంభంలో విండీస్ పేసర్లు వణికించారు. అయితే రోహిత్, రాహుల్‌ల నిలకడ జట్టు భారీ స్కోరుకు దోహదపడింది. మూడో ఓవర్‌లోనే గిల్ (1), విరాట్ (0) వికెట్లను సీల్ పడగొట్టాడు. సెంచరీకి చేరువలో వెనుదిరిగిన హిట్ మ్యాన్ మూడో వికెట్‌కు రుతురాజ్‌తో కలిసి 137 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఆ రాహుల్ తీసుకున్నాడు. కెరీర్‌లో తొమ్మిదో శతకంతో ఆకట్టుకున్నాడు.
స్కోరుబోర్డు
భారత్: రోహిత్ (సి) ఆండ్రూ (బి) పాల్ 92, గిల్ (సి) హోప్ (బి) సీల్స్ 1, విరాట్ (బి) సీల్స్ 0, రుతురాజ్ (సి) క్యాంప్‌బెల్ (బి) సీల్స్ 57, రాహుల్ (నాటౌట్) 129, నమన్ (సి) ఆండ్రూ (బి) మోటీ 30, నితీశ్ (సి) హోప్ (బి) పాల్ 9, కాంబోజ్ (రనౌట్) 17, బ్రార్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 50 ఓవర్లలో 351/7. వికెట్ల పతనం: 1-3, 2-4, 3-141, 4-160, 5-225, 6-250, 7-290; బౌలింగ్: సీల్స్ 10-0-62-3, ఫోర్డ్ 6-0-26-0, జోసెఫ్ 10-1-70-0, పాల్ 9-0-71-2, మోటీ 10-0-67-1, లావెస్ 5-0-54-0.
వెస్టిండీస్: క్యాంప్‌బెల్ (బి) సిరాజ్ 10, హోప్ (నాటౌట్) 162, జాంగూ (రనౌట్) 67, రూథర్‌ఫోర్డ్ (సి) రాహుల్ (బి) నమన్ 24, పాల్ (సి) నితీశ్ (బి) బ్రార్ 44, ఫోర్డ్ (సి) నమన్ (బి) కుల్దీప్ 7, మోటీ (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు: 19; మొత్తం: 48.2 ఓవర్లలో 352/5. వికెట్ల పతనం: 1-41, 2-150, 3-206, 4-271, 5-290; బౌలింగ్: సిరాజ్ 8-0-52-1, కాంబోజ్ 9-0-82-0, బ్రార్ 9.1-0-64-1, కుల్దీప్ 10-0-62-1, నితీశ్ 6.5-0-50-0, నమన్ 5.2-0-33-1.
1
తక్కువ ఇన్నింగ్స్ (202)లోనే ఓపెనర్‌గా పది వేల పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా రోహిత్. ఓవరాల్‌గా సచిన్ (15310), జయసూర్య (12740), గేల్ (10179) ముందున్నారు.
1
వన్డే చరిత్రలో అత్యధిక సార్లు (45) 350+ స్కోర్లు నమోదు చేసిన జట్టుగా భారత్
1
తమ వన్డే చరిత్రలో విండీస్‌కిదే భారీ ఛేదన (352)
1
మూడు వన్డేల సిరీస్‌లో ఎక్కువ శతకాలు (10) నమోదు కావడం ఇదే తొలిసారి.