నీరజ్‌చోప్రా స్ఫూర్తితో రాణిస్తున్న అథ్లెట్లు
ABN , Publish Date - Aug 07 , 2026 | 11:21 AM
భారత క్రీడా చరిత్రలో ఆగస్టు 7 అనేది ఒక సువర్ణాక్షరాల పేజీ. 2021 టోక్యో ఒలంపిక్స్‌లో భారత అథ్లెట్ నీరజ్‌చోప్రా జావెలిన్ త్రోను 87.58 మీటర్ల దూరం విసిరి అథ్లెటిక్స్‌లో భారతదేశానికి తొలి స్వర్ణ పతకం సాధించి సరికొత్త చరిత్రను సృష్టించారు.
నేడు జాతీయ జావెలిన్ త్రో దినోత్సవం
వరంగల్ స్పోర్ట్స్: భారత క్రీడా చరిత్రలో ఆగస్టు 7 అనేది ఒక సువర్ణాక్షరాల పేజీ. 2021 టోక్యో ఒలంపిక్స్‌లో భారత అథ్లెట్ నీరజ్‌చోప్రా జావెలిన్ త్రోను 87.58 మీటర్ల దూరం విసిరి అథ్లెటిక్స్‌లో భారతదేశానికి తొలి స్వర్ణ పతకం సాధించి సరికొత్త చరిత్రను సృష్టించారు. ఈ విజయాన్ని గుర్తు చేసుకోవడంతో పాటు జావెలిన్ త్రో క్రీడను ప్రోత్సహించడానికి భారత అథ్లెటిక్స్ సమాఖ్య(ఏఎఫ్ఐ) ప్రతీ యేట ఆగస్టు 7న జాతీయ జావెలిన్‌త్రో దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
అదే విధంగా ఇటీవల స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరంలో నిర్వహించిన కామన్‌వెల్త్ క్రీడల్లో దేశం తరుపున అథ్లెట్లు అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించి పతకాల పంట పండించారు. కామన్‌వెల్త్ స్ఫూర్తితో హనుమకొండ జేఎన్ క్రీడా మైదానంలో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో పలువురు అథ్లెట్లు తమ ప్రతిభకు పదును పెట్టేందుకు నిష్ణాతులైన కోచ్‌ల పర్యవేక్షణలో తర్ఫీదు పొందుతున్నారు.
దశాబ్దాలుగా దేశంలో క్రికెట్, బ్యాడ్మింటన్ వంటి క్రీడలకే దక్కే ఆదరణను, ట్రాక్ అండ్ ఫీల్డ్ క్రీడలకు తీసుకురావడంలో జావెలిన్ డే ఒక మైలురాయిగా నిలిచింది. ఒకప్పుడు వ్యాయామానికే పరిమితమైన ఈటె విసరడం.. నేడు గ్రామీణ, పట్టణ ప్రాంతాల యువతకు లక్ష్యంగా మారింది. జావెలిన్ త్రో డే ఒక రోజు వేడుకగా మాత్రమే మిగిలి పోకుండా యువ క్రీడా రత్నాలను వెలికితీసి అంతర్జాతీయ విజేతలుగా తీర్చిదిద్దే ప్రతిజ్ఞా దినంగా మారాలని క్రీడా నిపుణులు కోరుకుంటున్నారు. జావెలిన్ డేను పురస్కరించుకొని మండల, జిల్లా స్థాయిల్లో నిర్వహించే పోటీల ద్వారా క్రీడాకారుల్లోని ప్రతిభను గుర్తించి వారికి సరైన శిక్షణ అందించడంతో యువతకు ఆ క్రీడా పట్ల ఆసక్తి, ప్రేరణ కలుగుతుందని పలువురు అథ్లెటిక్స్ సంఘ బాధ్యులు, సీనియర్ అథ్లెట్లు అంటున్నారు.
నీరజ్‌చోప్రా విజయం నమ్మకాన్ని పెంచింది..
గుగులోత్ అనిల్‌కుమార్, జావెలిన్‌త్రో క్రీడాకారుడు, అథ్లెట్
గతంలో అథ్లెటిక్స్ అనగానే పరుగు పందెం మాత్ర మే అనుకునే వాళ్లం. కానీ, 2021 టోక్యో ఒలంపిక్స్‌లో నీరజ్‌చోప్రా స్వర్ణ పతకం సాధించడంతో జావెలిన్ త్రో క్రీడ పట్ల ఎంతో ఆసక్తి పెరిగింది. అదే విధంగా ఇటీవల గ్లాస్గోలో నిర్వహించిన కామన్‌వెల్త్ క్రీడల్లో సైతం నీరజ్ చోప్రా రజతం సాధించి వర్ధమాన అథ్లెట్లలో నూతన ఉత్తేజాన్ని నింపాడు. సరైన సాధన ఉంటే అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం అసాధ్యమేమి కాదని నిరూపితమైంది.
మహిళా అథ్లెట్లకు మంచి భవిష్యత్..
బాకారం సోని, రీజినల్ స్పోర్ట్స్ హాస్టల్ అథ్లెట్ హనుమకొండ
జావెలిన్ అనగానే కేవలం అబ్బాయిల ఆట అనుకునే భావన ఉంది. కానీ, అనురాణి లాంటి మహిళా అథ్లెట్ల విజయాలు మాలో ధైర్యా న్ని నింపాయి. శారీరక బలం కంటే టెక్నిక్స్, ఈటె విసిరే విధానం చాలా ముఖ్యం. హనుమకొండ జేఎన్‌ఎ్‌సలో డీఎ్‌సఏ అథ్లెటి క్స్ కోచ్ శ్రీమన్నారాయణ వద్ద జావెలిన్‌లో గత నాలుగేళ్లుగా ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నా.
మరింత ప్రోత్సాహం కావాలి..
కె.సారంగపాణి, అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
జావెలిన్ అనేది సరైన కోచింగ్, గ్రిప్, ఫాలో-త్రో టెక్నిక్స్‌తో కూడిన క్రీడ. ఇటీవల జిల్లా స్థాయిలో మంచి క్రీడాకారులు వెలుగులోకి వస్తున్నారు. అయితే పాఠశా ల, కళాశాల స్థాయిలో నాణ్యమైన ఈటెలు, ప్రత్యేకమైన సింథటిక్ రన్-వేల కొరత ఉంది. ప్రభుత్వాలు, క్రీడా సంఘాలు మౌలిక వసతులను మరింత మెరుగుపరిస్తే చిన్న నగరాల నుంచి వందలాది మంది చోప్రాలు పుట్టుకొస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ప్రభుత్వ దవాఖానాల్లో అత్యవసర మందులేవీ..?
హైదరాబాద్‌లో తప్పని నీళ్ల సర్దుబాటు
Read Latest AP News And Telangana News And International News And Telugu News