ఏకైక రిటైర్డ్ ప్లేయర్‌గా సచిన్ రికార్డు.. ఏమాత్రం తగ్గని బ్రాండ్ వాల్యూ
ABN , Publish Date - Aug 07 , 2026 | 10:55 AM
క్రికెట్‌కు వీడ్కోలు పలికి 13 ఏళ్ల గడిచినా భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ బ్రాండ్ విలువ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. క్రోల్ ఇండియా సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్-2025 నివేదిక ప్రకారం సచిన్ బ్రాండ్ విలువ125.9 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ.1,189 కోట్లు)గా నమోదైంది.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్‌కు వీడ్కోలు పలికి 13 ఏళ్ల గడిచినా భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ బ్రాండ్ విలువ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. క్రోల్ ఇండియా సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్-2025 నివేదిక ప్రకారం సచిన్ బ్రాండ్ విలువ125.9 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ.1,189 కోట్లు)గా నమోదైంది. ఈ విలువతో దేశంలోని టాప్-5 సెలబ్రిటీ బ్రాండ్లలో సచిన్ చోటు దక్కించుకున్నాడు. అంతేకాదు, భారత టాప్-10 సెలబ్రిటీ బ్రాండ్లలో నిరంతరం కొనసాగుతున్న ఏకైక రిటైర్డ్ క్రీడాకారుడిగా సచిన్ ప్రత్యేక గుర్తింపు పొందాడు. విరాట్ కోహ్లీ, ధోని కంటే కూడా ఎక్కువ బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా సచిన్ వ్యవహరిస్తుండటం విశేషం.
వివిధ రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలు ఇప్పటికీ సచిన్‌ను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి. రిటైర్ అయిన తర్వాత కూడా అతడి బ్రాండ్ విలువ ఏటా పెరుగుతుండటం విశేషం. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన సచిన్.. అంతర్జాతీయ క్రికెట్‌లో 34,357 పరుగులు చేసి అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. టెస్టులు, వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు. తన కెరీర్‌లో 200 టెస్టులు ఆడిన ఏకైక క్రికెటర్‌గా నిలిచిన అతడు.. ఆ ఫార్మాట్‌లో 15,921 పరుగులు, 51 సెంచరీలు, 2,058 ఫోర్లు నమోదు చేశాడు. సచిన్ రిటైర్ అయినా, భారత క్రికెట్‌లోనూ.. బ్రాండ్ ప్రపంచంలోనూ అతడి ప్రభావం ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదని తాజా నివేదిక మరోసారి స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి:
గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయిస్ టైటిల్ విజేతగా ప్రజ్ఞానంద
శ్రీలంక సిరీస్‌లో భారత్‌కు ‘డూ ఆర్ డై’.. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు నిలవాలంటే?