గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయిస్ టైటిల్ విజేతగా ప్రజ్ఞానంద
ABN , Publish Date - Aug 07 , 2026 | 10:32 AM
భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద మరో ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అమెరికాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయిస్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద మరో ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అమెరికాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయిస్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు. గురువారం జరిగిన రెండో రౌండ్‌లో జవోఖిర్ సిందరోవ్‌తో డ్రా చేసుకున్నాడు. దీంట్లో ప్రజ్ఞానంద మొత్తం 23/35 పాయింట్లు సాధించి, ఒక రౌండ్ మిగిలి ఉండగానే ఛాంపియన్‌గా అవతరించాడు. సమీప ప్రత్యర్థుల కంటే 1.5 పాయింట్ల ఆధిక్యంతో టైటిల్‌ను ఖాయం చేశాడు.
ఈ విజయంపై చెస్‌బేస్ ఇండియా ‘ఎక్స్’లో స్పందించింది. ‘భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2:16 గంటలకు అమెరికా నుంచి అద్భుతమైన వార్త వచ్చింది. ఒక రౌండ్ మిగిలి ఉండగానే ప్రజ్ఞానంద గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయిస్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ ఛాంపియన్‌గా నిలిచాడు. అతడు గెలిచిన తొలి ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టోర్నమెంట్ ఇదే. ప్రజ్ఞానందతో పాటు అతడి బృందానికి అభినందనలు’ అని పేర్కొంది.
ఇటీవల జూన్‌లో జరిగిన నార్వే చెస్ 2026 టోర్నమెంట్‌లోనూ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. చివరి రౌండ్‌లో జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచాడు. వరుసగా నాలుగు క్లాసికల్ గేమ్‌ల్లో విజయాలు సాధించి తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. నార్వే చెస్ విజయానంతరం తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ చెన్నైలో ప్రజ్ఞానందను సన్మానించి, రూ.50 లక్షల నగదు బహుమతి అందజేసిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
వైభవ్ విజయాల్లో కుటుంబ సభ్యులదే అత్యంత కీలక పాత్ర: రహానె
నబిని నేరుగా జట్టులోకి తీసుకోవాల్సింది.. అగార్కర్, గంభీర్‌పై మాజీ క్రికెటర్ విమర్శలు