ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్.. టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్
ABN , Publish Date - Apr 20 , 2026 | 07:16 PM
ఐపీఎల్ 2026లో భాగంగా నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత ముంబై బ్యాటింగ్‌కు దిగనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత ముంబై బ్యాటింగ్‌కు దిగనుంది. అయితే ఆడిన ఐదు మ్యాచుల్లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి అట్టడుగు స్థానంలో ఉన్న ఎంఐకు ఈ మ్యాచ్ కీలకంగా మారనుంది. స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ముంబై విజయాల కోసం ఎదురుచూస్తోంది. మరోవైపు ఆడిన ఐదు మ్యాచుల్లో 3 గెలిచిన జీటీ.. ఆరో స్థానంలో ఉంది. మరి ఈ మ్యాచులో ముంబై బ్యాటర్లు ఫామ్ అందుకుంటారా? బుమ్రా వికెట్ల ఖాతా తెరుస్తాడా? జీటీ ప్లేయర్లు అదరగొడతారా? చూడాల్సి ఉంది.
ముంబై ఇండియన్స్ తుది జట్టు
దానిశ్ మాలెవార్, క్విటన్ డికాక్(వికెట్ కీపర్), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య(కెప్టెన్), తిలక్ వర్మ, రూథర్‌ఫర్డ్, మిచెల్ శాంట్నర్, క్రిష్ భగత్, బుమ్రా, ఘజన్‌ఫర్
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: రాజ్ బవా, అశ్వని కుమార్, బోష్, మయాంక్ రావత్, రఘు శర్మ
గుజరాత్ టైటాన్స్ తుది జట్టు
శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, సిరాజ్, రబాడా, ప్రసిద్ధ్ కృష్ణ, అశోక్ శర్మ
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: రాహుల్ తెవాటియా, జోసన్ హోల్డర్, మానవ్ సుతార్, కుల్వంత్, అనుజ్ రావత్
ఇవి కూడా చదవండి:
సరికొత్త అధ్యాయం.. టీ20 క్రికెట్ ఫ్రాంచైజీ సహ యజమానిగా క్రిస్ గేల్
బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఒకేసారి రెండు టీ20 జట్లు!