Share News

వైభవ్ దూకుడును ఎలా ఆపాలి? జోఫ్రా ఆర్చర్ సమాధానం ఇదే..

ABN , Publish Date - May 28 , 2026 | 10:58 AM

వైభవ్‌ సూర్యవంశీ దూకుడును ఎలా ఆపొచ్చనే ప్రశ్నకు రాజస్థాన్ రాయల్స్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వైభవ్ దూకుడును ఎలా ఆపాలి? జోఫ్రా ఆర్చర్ సమాధానం ఇదే..
Vaibhav Sooryavanshi

ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం ఐపీఎల్ 2026లో ప్రత్యర్థి బౌలర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి మరోసారి తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎన్ని వ్యూహాలు సిద్ధం చేసినా.. వైభవ్‌ దూకుడుకు అడ్డుకట్ట వేయడంలో సన్‌రైజర్స్ జట్టు పూర్తిగా విఫలమైంది. ఈ నేపథ్యంలో వైభవ్‌ను ఎలా కట్టడి చేయొచ్చనే ప్రశ్నకు రాజస్థాన్ రాయల్స్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


‘వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన నాక్ ఆడాడు. ఇలా దూకుడుగా ఆడి పరుగులు చేస్తే మాకు డిఫెండ్ చేయడానికి కాస్త ఈజీగా ఉంటుంది. వైభవ్ ఎలాంటి బంతి సంధించినా బౌండరీకి పంపేస్తాడు. అదే అతడి స్పెషాలిటీ. సులువుగా 150 పరుగులు కూడా చేయగలడు’ అంటూ ఆర్చర్.. వైభవ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఆ తర్వాత వైభవ్ దూకుడును ఎలా ఆపాలి? అంటూ ఎదురైన ప్రశ్నకు ఆర్చర్ సరదాగా సమాధానం ఇచ్చాడు. ‘అతడికి ఎక్కడ బౌలింగ్ చేస్తే ఔట్ అవుతాడో నాకు తెలుసు. వైభవ్ దూకుడును ఆపేందుకు ఓ టెక్నిక్ ఉంది. కానీ ఇప్పుడే చెప్పను. ఐపీఎల్ ముగిసిన తర్వాత ఈ ప్రశ్నకి సమాధానం చెబుతాను’ అంటూ తెలిపాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


అదే వైభవ్ స్పెషాలిటీ: ధ్రువ్ జురెల్

ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన ధ్రువ్ జురెల్ కూడా వైభవ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘వైభవ్ ప్రత్యేకత ఏమిటంటే అతడు ఎక్కువగా ప్లాన్ చేయడు. నెట్స్‌లో చాలా కష్టపడతాడు. తనపై అతడికి అపారమైన నమ్మకం ఉంటుంది. ‘నేను చేయలేను’ అనే సందేహం అతడిలో అసలు ఉండదు. అకాడమీలో చిన్నప్పటి నుంచే బౌలర్‌ను కాదు.. బంతిని చూడాలని చెబుతారు. కానీ మేమంతా బౌలర్ వైపే ఎక్కువగా చూస్తూ ఉండేవాళ్లం. వైభవ్ మాత్రం కేవలం బంతినే చూస్తాడు. అతడికి ప్రత్యర్థి బౌలర్ ఎంత సీనియర్ అయినా అవేం పట్టించుకోడు. బౌలర్‌ను కాకుండా బంతిని చూస్తాడు. వచ్చిన బంతిని ఆడటమే అతడి మంత్రం. అదే వైభవ్ విజయ రహస్యం’ అని ధ్రువ్ జురెల్ తెలిపాడు.


ఇవి కూడా చదవండి:

యూనివర్సల్ బేబీ బాస్ తాండవం.. క్రిస్ గేల్ రికార్డు బద్దలు

గేల్ సెంచరీ రికార్డు ఎందుకు మిస్ అయ్యానంటే..: వైభవ్ సూర్యవంశీ

Updated Date - May 28 , 2026 | 10:58 AM