ఐపీఎల్ 2026: గుజరాత్ టైటాన్స్‌తో కీలక పోరు.. టాస్ నెగ్గిన ఎస్ఆర్‌హెచ్
ABN , Publish Date - May 12 , 2026 | 07:14 PM
ఐపీఎల్ 2026 ముగింపు దశకు చేరుకోవడంతో ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. ప్లే ఆఫ్స్ బెర్తే లక్ష్యంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఎస్ఆర్‌హెచ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 ముగింపు దశకు చేరుకోవడంతో ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. ప్లే ఆఫ్స్ బెర్తే లక్ష్యంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఎస్ఆర్‌హెచ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. 11 మ్యాచుల్లో 7 విజయాలతో 14 పాయింట్లు నెగ్గి పట్టికలో రెండో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్‌కు మరో గెలుపు ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖాయం చేస్తుంది. సరిగ్గా అవే గణాంకాలతో మూడో స్థానంలో ఉన్న గుజరాత్‌దీ అదే పరిస్థితి. దీంతో ఈ పోరు ఫలితం ప్లే ఆఫ్స్ సమీకరణంలో కీలకం కానుంది. అయితే ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లు లావెండర్ కలర్ జెర్సీతో బరిలోకి దిగనున్నారు. క్యాన్సర్‌పై అవగాహనను పెంపొందించడం, ఈ వ్యాధితో పోరాడుతున్నవారికి మద్దతుగా నిలవడానికి ప్రతి ఏడాది ఒక రోజు ఈ కలర్ జెర్సీతో జీటీ ప్లేయర్లు ఆడుతున్న విషయం తెలిసిందే.
ఎస్ఆర్‌హెచ్ తుది జట్టు
ప్యాట్ కమిన్స్(కెప్టెన్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, నితీశ్ కుమార్ రెడ్డి, స్మరన్ రవిచంద్రన్, శివాంగ్ కుమార్, ఎషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: ట్రావిస్ హెడ్, లియామ్ లివింగ్‌స్టోన్, అనికేత్ వర్మ, హర్షల్ పటేల్, హర్ష్ దూబె
గుజరాత్ టైటాన్స్ తుది జట్టు
శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, బట్లర్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, నిశాంత్ సింధు, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, రబాడా, సిరాజ్
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిషోర్, అనుజ్ రావత్, కుమార్ కుషాగ్రా, ఫిలిప్స్
ఇవి కూడా చదవండి:
నేను స్వయంగా రిటైర్ అవ్వాలనేదే వారి కోరిక: వినేశ్ ఫొగాట్
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు భారీ జరిమానా