Share News

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు భారీ జరిమానా

ABN , Publish Date - May 12 , 2026 | 03:02 PM

ఐపీఎల్ 2026లో భాగంగా సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠ పోరులో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. జట్టు గెలిచినప్పటికీ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు మాత్రం బీసీసీఐ షాక్ ఇచ్చింది.

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు భారీ జరిమానా
Axar Patel

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠ పోరులో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో డీసీ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. జట్టు గెలిచినప్పటికీ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు మాత్రం బీసీసీఐ షాక్ ఇచ్చింది. ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌ను నిర్ణీత సమయంలో పూర్తి చేయకపోవడంతో స్లో ఓవర్‌రేట్ కారణంగా బీసీసీఐ అక్షర్‌కు రూ.12 లక్షల జరిమానా విధించింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.22 ప్రకారం ఈ సీజన్‌లో ఢిల్లీకి ఇది తొలి తప్పిదం కావడంతో జరిమానాతో సరిపెట్టింది.


ఐపీఎల్ 2026లో స్లో ఓవర్ రేట్ సమస్య పలువురు కెప్టెన్లకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యలపై కూడా బీసీసీఐ చర్యలు తీసుకుంది. గతంలో ఒకే జట్టు పదేపదే స్లో ఓవర్ రేట్‌కు పాల్పడితే కెప్టెన్లపై సస్పెన్షన్ విధించే నిబంధన ఉండేది. అయితే 2025 నుంచి ఆ నియమాన్ని బీసీసీఐ రద్దు చేసింది. ఇదిలా ఉంటే, పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ సంచలన విజయం సాధించింది. 211 పరుగుల భారీ లక్ష్యాన్ని 19 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ అక్షర్ పటేల్(56), డేవిడ్ మిల్లర్(51) హాఫ్ సెంచరీలు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ ఫైనల్స్: అహ్మదాబాద్ స్టేడియానికే ఎందుకింత ప్రాధాన్యం?

భువీని భారత జట్టులోకి తీసుకురావాలి: రవిచంద్రన్ అశ్విన్

Updated Date - May 12 , 2026 | 03:02 PM