ఢిల్లీ రేసులోనే..
ABN , Publish Date - May 12 , 2026 | 02:59 AM
ప్రతీ మ్యాచ్‌ను గెలిచి తీరాల్సిన స్థితిలో.. ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠను అధిగమిస్తూ అద్భుత ఆటతీరును కనబర్చింది. సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి ఖాయమనుకున్న దశలో...
నేటి మ్యాచ్
గుజరాత్ X సన్‌రైజర్స్
వేదిక : అహ్మదాబాద్, రా.7.30
పంజాబ్‌పై ఉత్కంఠ విజయం
అదరగొట్టిన అక్షర్, మిల్లర్
ధర్మశాల: ప్రతీ మ్యాచ్‌ను గెలిచి తీరాల్సిన స్థితిలో.. ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠను అధిగమిస్తూ అద్భుత ఆటతీరును కనబర్చింది. సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి ఖాయమనుకున్న దశలో మరో ఓవర్ ఉండగానే భారీ స్కోరును ఛేదించి 3 వికెట్ల తేడాతో గెలిచింది. ప్రస్తుతం 10 పాయింట్లతో ఉన్న ఢిల్లీ మిగిలిన రెండు మ్యాచ్‌లను కూడా గెలిచి ఇతర జట్ల ఫలితాల కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది. ఇక ఆరంభంలో జైత్రయాత్ర సాగించిన శ్రేయాస్ సేనకిది వరుసగా నాలుగో ఓటమి. ముందుగా పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 210 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ (36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 నాటౌట్), ప్రియాన్ష్ ఆర్య (33 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 56), కూపర్ (27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38) రాణించారు. మాధవ్, స్టార్క్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో ఢిల్లీ 19 ఓవర్లలో 216/7 స్కోరు చేసి గెలిచింది. కెప్టెన్ అక్షర్ పటేల్ (30 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 56), డేవిడ్ మిల్లర్ (28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 51) కీలక ఇన్నింగ్స్‌తో ఆదుకున్నారు. చివర్లో అశుతోష్ (10 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 24), మాధవ్ తివారి (8 బం తుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 18 నాటౌట్) చెలరేగారు. అర్ష్‌దీప్, యష్‌లకు రెండేసి వికెట్లు లభించాయి. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా మాధవ్ తివారి నిలిచాడు.
చివర్లో దూకుడు: భారీ ఛేదనలో ఢిల్లీ ఆరంభంలోనే టపటపా వికెట్లను కోల్పోయింది. కానీ అక్షర్, మిల్లర్ సమన్వయంతో పాటు చివర్లో టెయిలెండర్ల దూకుడుతో మరో ఓవర్ ఉండగానే కీలక విజయాన్నందుకుంది. రెండో ఓవర్‌లోనే ఓపెనర్ అభిషేక్ పోరెల్ (5)ను పేసర్ యష్ అవుట్ చేయగా.. తన వరుస ఓవర్లలో రాహుల్ (9), సాహిల్ (13)లను అర్ష్‌దీప్ పెవిలియన్ చేర్చాడు. దీంతో 33/3 స్కోరుతో ఢిల్లీ కష్టాల్లో పడింది. పవర్‌ప్లేలో ఢిల్లీ చేసింది 47 పరుగులే. 9వ ఓవర్‌లో స్టబ్స్ (12) రనౌటవడం మరింత దెబ్బతీసింది. ఈ పరిస్థితిలో మిల్లర్ సహకారంతో అక్షర్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. 14వ ఓవర్‌లో హ్యాట్రిక్ ఫోర్లతో ఆకట్టుకున్న అక్షర్ 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కానీ మరో భారీషాట్‌కు వెళ్లి డ్వార్షుస్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో ఐదో వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మిల్లర్ మాత్రం ధాటిని కొనసాగిస్తూ బౌండరీలతో ఉత్కంఠ పెంచాడు. రెండు వరుస సిక్సర్లతో 27 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసిన అతడిని పేసర్ డ్వార్షుస్ అవుట్ చేయడంతో పంజాబ్ ఊపిరిపీల్చుకుంది. కానీ 18వ ఓవర్‌లో అశుతోష్ 4,6 మాధవ్ 6తో 19 పరుగులు రావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. 12 బంతుల్లో 17 రన్స్ కావాల్సిన వేళ 19వ ఓవర్‌లో అశుతోష్ వికెట్ కోల్పోయినా.. మాధవ్, అకీబ్ (2 బంతుల్లో ఓ ఫోర్, సిక్సర్‌తో 10 నాటౌట్) జోరుకు 22 పరుగులు రావడంతో మ్యాచ్ ముగిసింది. చివరి నాలుగు ఓవర్లలోనే ఢిల్లీ 73 రన్స్ రాబట్టడం విశేషం.
ప్రియాన్ష్, శ్రేయా్‌సల అండతో: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ప్రియాన్ష్ ధనాధన్ ఆటతో రెచ్చిపోయాడు. మధ్య ఓవర్లలో శ్రేయాస్ అండగా నిలిచి అజేయ అర్ధసెంచరీతో జట్టు స్కోరును 200 దాటించాడు. తొలి ఓవర్‌లోనే ప్రియాన్ష్ రెండు సిక్సర్లు బాదడంతో ఏకంగా 22 పరుగులతో పంజాబ్‌కు మెరుపు ఆరంభం లభించింది. ఇక మూడో ఓవర్‌లోనూ ప్రియాన్ష్ 6,6,4తో చెలరేగడంతో జట్టు 16 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసింది. అయితే సహజశైలిలో ఆడలేకపోయిన మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ (18)ను పవర్‌ప్లే తర్వాత పేసర్ ముకేశ్ అవుట్ చేశాడు. తొలి వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఇక 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ప్రియాన్ష్‌ను కూడా కాసేపటికే పేసర్ మాధవ్ పెవిలియన్‌కు చేర్చాడు. మధ్య ఓవర్లలో ఢిల్లీ బౌలర్లు పట్టు సాధించారు. ఈ స్థితిలో శ్రేయాస్, కూపర్ నిలకడను చూపారు. చెత్త బంతులను బౌండరీలుగా మలుస్తూ 16వ ఓవర్‌లో స్కోరును 150 దాటించారు. అటు శ్రేయాస్ 32 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. 18వ ఓవర్‌లో కూపర్ వికెట్ కోల్పోయినా శ్రేయాస్ రెండు సిక్సర్లు బాదాడు. రెండో వికెట్‌కు 83 పరుగుల భాగస్వామ్యం జత చేరింది. 19వ ఓవర్‌లో స్టొయినిస్ (1), శశాంక్ (0)లను స్టార్క్ వరుస బంతుల్లో అవుట్ చేసి షాకిచ్చాడు. కానీ సూర్యాన్ష్ (21 నాటౌట్) వచ్చీ రాగానే 6,4,6తో అదే ఓవర్‌లో 16 రన్స్ అందించాడు. ఎన్‌గిడి మాత్రం చివరి ఓవర్‌లో ఏడు పరుగులిచ్చి ప్రత్యర్థి స్కోరును 210కి పరిమితం చేశాడు.
స్కోరుబోర్డు
పంజాబ్: ప్రియాన్ష్ (సి) సాహిల్ (బి) మాధవ్ 56, ప్రభ్‌సిమ్రన్ (సి) అకీబ్ (బి) ముకేశ్ 18, శ్రేయాస్ (నాటౌట్) 59, కూపర్ (సి) మిల్లర్ (బి) మాధవ్ 38, స్టబ్స్ (సి) మాధవ్ (బి) స్టార్క్ 1, శశాంక్ (సి) అక్షర్ (బి) స్టార్క్ 0, సూర్యాన్ష్ (నాటౌట్) 21, ఎక్స్‌ట్రాలు: 17; మొత్తం: 20 ఓవర్లలో 210/5; వికెట్ల పతనం: 1-78, 2-97, 3-180, 4-187, 5-187; బౌలింగ్: స్టార్క్ 4-0-57-2, అకీబ్ నబి 4-0-32-0, ఎన్‌గిడి 4-0-46-0, ముకేశ్ 4-0-31-1, మాధవ్ తివారి 4-0-40-2.
ఢిల్లీ: రాహుల్ (సి) యాన్సెన్ (బి) అర్ష్‌దీప్ 9, అభిషేక్ పోరెల్ (బి) యష్ 5, సాహిల్ (సి) చాహల్ (బి) అర్ష్‌దీప్ 13, స్టబ్స్ (రనౌట్) 12, అక్షర్ పటేల్ (సి) డ్వార్షుస్ (బి) స్టొయినిస్ 56, మిల్లర్ (సి) ప్రభ్‌సిమ్రన్ (బి) డ్వార్షుష్ 51, అశుతోష్ (సి/సబ్) ప్రవీణ్ దూబే (బి) యష్ 24, మాధవ్ తివారి (నాటౌట్) 18, అకీబ్ (నాటౌట్) 10, ఎక్స్‌ట్రాలు: 18; మొత్తం: 19 ఓవర్లలో 216/7; వికెట్ల పతనం: 1-10, 2-14, 3-33, 4-74, 5-138, 6-170, 7-205; బౌలింగ్: అర్ష్‌దీప్ 4-0-21-2, యష్ ఠాకూర్ 4-0-55-2, యాన్సెన్ 4-0-45-0, డ్వార్షుస్ 4-0-51-1, స్టొయినిస్ 3-0-44-1.

ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ ఫైనల్స్: అహ్మదాబాద్ స్టేడియానికే ఎందుకింత ప్రాధాన్యం?
భువీని భారత జట్టులోకి తీసుకురావాలి: రవిచంద్రన్ అశ్విన్