కోహ్లీపై తప్పుడు ఆరోపణలు చేయమని డబ్బు ఆఫర్ చేశారు: లిజ్‌లాజ్
ABN , Publish Date - May 12 , 2026 | 04:37 PM
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి సంబంధించిన సోషల్ మీడియా వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. జర్మన్ మోడల్, సింగర్ లిజ్‌లాజ్ ఇన్‌స్టా ఫొటోకు కోహ్లీ లైక్ కొట్టిన అంశం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ విషయంపై లిజ్‌లాజ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి సంబంధించిన సోషల్ మీడియా వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. జర్మన్ మోడల్, సింగర్ లిజ్‌లాజ్ ఇన్‌స్టా ఫొటోకు కోహ్లీ లైక్ కొట్టిన అంశం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ విషయంపై లిజ్‌లాజ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. కోహ్లీపై తప్పుడు ఆరోపణలు చేయాలని కొందరు జర్నలిస్టులు తనను సంప్రదించారని.. అందుకు డబ్బు కూడా ఆఫర్ చేశారని ఆమె వెల్లడించింది.
‘కోహ్లీ నా ఫొటోకు లైక్ కొట్టడంతో అనూహ్యంగా నేను సోషల్ మీడియాలో వైరల్ అయ్యాను. ఆ ఘటన తర్వాత పలువురు జర్నలిస్టులు నా దగ్గరికి వచ్చారు. కోహ్లీ గురించి చెడుగా మాట్లాడాలని, అతడు చేయని పనులపై కూడా ఆరోపణలు చేయాలని కోరారు. నాకు డైరెక్ట్‌గా మెసేజ్‌లు చేస్తున్నట్లు చెప్పమన్నారు. దానికి నాకు భారీగా డబ్బు కూడా ఆఫర్ చేశారు. కానీ నేను అలా ఎందుకు చేస్తాను? విరాట్ అంటే నాకు పిచ్చి అభిమానం. డబ్బు లేదా పాపులారిటీ కోసం అతడి ప్రతిష్ఠను దెబ్బతీసే ఉద్దేశం నాకు లేదు’ అని లిజ్‌లాజ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘అందుకే కోహ్లీ దేశాన్ని వదిలి వెళ్లాడు’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
జర్మనీకి చెందిన లిజ్‌లాజ్‌కు.. జర్మన్‌తో పాటు డచ్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్ భాషలపై కూడా పట్టు ఉంది. సైకాలజీలో ఎంఎస్సీ పూర్తి చేసిన ఆమె.. సర్టిఫైడ్ లైఫ్ సేవింగ్ స్విమ్మర్ కూడా. ఫుడ్ వ్లాగింగ్, ట్రావెలింగ్, సాంగ్ రైటింగ్ ఆమె హాబీలు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు, విరాట్ కోహ్లీకి తాను అభిమానిని అంటూ గతంలో లిజ్‌లాజ్ చెప్పిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
నేను స్వయంగా రిటైర్ అవ్వాలనేదే వారి కోరిక: వినేశ్ ఫొగాట్
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు భారీ జరిమానా