ఐపీఎల్ 2026: చెలరేగిన ఇషాన్, క్లాసెన్.. పంజాబ్ విజయ లక్ష్యం ఎంతంటే?
ABN , Publish Date - May 06 , 2026 | 09:15 PM
ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్‌కు 236 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్‌కు 236 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. హైదరాబాద్ బ్యాటర్లు ఇషాన్ కిషన్(55; 32 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), హెన్రిచ్ క్లాసెన్(69; 43 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
అభిషేక్ శర్మ(35;13 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), ట్రావిస్ హెడ్(38; 19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. నితీశ్ కుమార్ రెడ్డి(29; 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆఖరిలో చెలరేగి ఆడాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, ఫెర్గుసన్, చాహల్, విజయకుమార్ వైశాఖ తలొక వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
సంజు శాంసన్ మా జట్టుకు వెన్నుముక: రుతురాజ్
భారత టీ20 జట్టులో వైభవ్ సూర్యవంశీకి అవకాశం!