బీసీసీఐ నిర్ణయం మమ్మల్ని తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది: కర్ణాటక క్రికెట్ బోర్డు
ABN , Publish Date - May 06 , 2026 | 08:44 PM
ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన ప్లే ఆఫ్స్ వేదికలను బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్లే ఆఫ్స్‌లోని ఒక్క మ్యాచ్‌ను కూడా చిన్నస్వామి స్టేడియంలో కేటాయించకపోవడంపై కర్ణాటక క్రికెట్ బోర్డు స్పందించింది. ఈ మేరకు అధికారిక ప్రతినిధి వినయ్ మృత్యుంజయ ప్రకటనను విడుదల చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన ప్లే ఆఫ్స్ వేదికలను బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే బెంగళూరును కాదని అహ్మదాబాద్‌లోని నరేంద్ర స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ప్లే ఆఫ్స్‌లోని ఒక్క మ్యాచ్‌ను కూడా చిన్నస్వామి స్టేడియానికి కేటాయించలేదు. లోకల్ అసోసియేషన్‌తో పాటు అక్కడి అధికారులు తమ నిబంధనలకు లోబడేలా నిర్ణయం తీసుకోలేకపోయారని ఈ మేరకు బీసీసీఐ ఓ ప్రకటన జారీ చేసింది. అయితే ప్లే ఆఫ్స్‌లోని ఒక్క మ్యాచ్‌ను కూడా చిన్నస్వామిలో కేటాయించకపోవడంపై కర్ణాటక క్రికెట్ బోర్డు స్పందించింది. ఈ మేరకు అధికారిక ప్రతినిధి వినయ్ మృత్యుంజయ ప్రకటనను విడుదల చేశారు.
‘కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్ ప్రసాద్ వ్యక్తిగతంగా నిరంతరం బీసీసీఐ పెద్దలతో టచ్‌లో ఉన్నారు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లను నిర్వహించేందుకు చిన్నస్వామి స్టేడియం సిద్ధంగానే ఉందని ఇప్పటికే బీసీసీఐకి తెలియజేశాం. ప్రస్తుత సీజన్‌లోనూ ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ చాలా ప్రశాంతంగా జరిగింది. క్రౌడ్ మేనేజ్‌మెంట్‌ను కూడా చక్కగా నిర్వహించాం. భారీ మ్యాచ్‌లను నిర్వహించగల సామర్థ్యం కేఎస్‌సీఏకు ఉందని నిరూపించాం. ఇప్పుడు ప్లే ఆఫ్స్‌లో ఒక్క మ్యాచ్‌ను కూడా కేటాయించకపోవడం మమ్మల్ని తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది’ అని కర్ణాటక క్రికెట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది.
ఇవి కూడా చదవండి:
సంజు శాంసన్ మా జట్టుకు వెన్నుముక: రుతురాజ్
భారత టీ20 జట్టులో వైభవ్ సూర్యవంశీకి అవకాశం!