Share News

ముంబై జట్టుతో కలవని హార్దిక్ పాండ్య.. కెప్టెన్సీపై వేటు పడిందా?

ABN , Publish Date - May 06 , 2026 | 05:27 PM

రాయ్‌పుర్ వేదికగా మే 10న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎంఐ తలపడనుంది. అందులో భాగంగా రాయ్‌పుర్ వెళ్లేందుకు ముంబై ఆటగాళ్లు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. కానీ అందులో హార్దిక్ పాండ్య కనిపించలేదు. దీంతో హార్దిక్ కెప్టెన్సీపై వేటు పడిందా? అనే చర్చ మొదలైంది.

ముంబై జట్టుతో కలవని హార్దిక్ పాండ్య.. కెప్టెన్సీపై వేటు పడిందా?
Hardik Pandya

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ పరిస్థితి సంక్లిష్టంగా మారింది. ఈ క్రమంలో మరో వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యకు ఎంఐ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి జట్టు ప్రదర్శన అత్యంత దారుణంగా పడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో హార్దిక్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ సీజన్‌లోనూ ఆడిన పది మ్యాచుల్లో కేవలం మూడింట్లో గెలిచిన ఎంఐ.. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. గత మ్యాచ్‌లో అనారోగ్యం కారణంగా హార్దిక్ ఆటకు దూరమయ్యాడు. అతడి స్థానంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేశాడు. పాండ్య గైర్హాజరీలో ఆడిన తొలి మ్యాచులోనే ముంబై అద్భుత విజయం సాధించింది. రోహిత్ శర్మ సూపర్ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. సూర్య కెప్టెన్సీ కూడా ఆకట్టుకుంది. దీంతో సూర్యనే ఎంఐ కెప్టెన్‌గా కొనసాగించాలనే డిమాండ్లు మొదలైన వేళ.. మరో వార్త చర్చనీయాంశమైంది.


రాయ్‌పుర్ వేదికగా మే 10న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎంఐ తలపడనుంది. అందులో భాగంగా రాయ్‌పుర్ వెళ్లేందుకు ముంబై ఆటగాళ్లు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. కానీ అందులో హార్దిక్ పాండ్య కనిపించలేదు. అతడు ఎప్పుడు జట్టుతోపాటు కలుస్తాడనే దానిపై స్పష్టత లేదు. దీంతో హార్దిక్ కెప్టెన్సీపై వేటు పడిందా? అనే చర్చ మొదలైంది. కెప్టెన్‌గానే కాకుండా ఆటగాడిగా హార్దిక్ పాండ్య పేలవ ప్రదర్శన చేశాడు. ఇప్పటి వరకు ముంబై ఆడిన పది మ్యాచుల్లో తొమ్మిదింటికి పాండ్య కెప్టెన్. అతడి సారథ్యంలో ఎంఐ కేవలం రెండు మ్యాచుల్లోనూ గెలిచింది. ఇక బ్యాటర్‌గానూ 146 పరుగులు చేయగా.. బౌలింగ్‌లో కేవలం నాలుగే వికెట్లు తీశాడు. దీంతో అతడిపై విమర్శలు, ఒత్తిడి ఒకేసారి పెరిగిపోయాయి. మరోవైపు సూర్య జట్టు పగ్గాలు చేపట్టిన తొలి మ్యాచులోనూ భారీ లక్ష్యాన్ని ఎంఐ ఛేదించేసింది. దీంతో పాండ్యను ఇప్పటికే సారథ్యం నుంచి ముంబై మేనేజ్‌మెంట్ పక్కన పెట్టిందనే వాదన కూడా ఉంది. ఆర్సీబీతో మ్యాచ్‌కు ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది. అప్పటికైనా గాయం నుంచి కోలకుని ఎంఐతో హార్దిక్ చేరాలని అభిమానులు కోరుకుంటున్నారు.


ఇవి కూడా చదవండి:

సంజు శాంసన్ మా జట్టుకు వెన్నుముక: రుతురాజ్

భారత టీ20 జట్టులో వైభవ్ సూర్యవంశీకి అవకాశం!

Updated Date - May 06 , 2026 | 05:27 PM