Share News

ట్రావిస్, అభిషేక్‌లకు బౌలింగ్ చేయాలంటే ఆ స్టార్ బౌలర్‌కు భయం!

ABN , Publish Date - May 06 , 2026 | 04:42 PM

ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఉప్పల్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ఫలితం.. ప్లే ఆఫ్స్‌పై ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదు.

ట్రావిస్, అభిషేక్‌లకు బౌలింగ్ చేయాలంటే ఆ స్టార్ బౌలర్‌కు భయం!
Yuzvendra Chahal

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ(బుధవారం) సన్ రైజర్స్ హైదరాబాద్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఉప్పల్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ఫలితం.. ప్లే ఆఫ్స్‌పై ను ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్‌ ఫామ్ పై ఆందోళన వ్యక్తం చేశాడు. చాహల్‌ను పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆచితూచి వాడుతున్నాడని పేర్కొన్నాడు.


చాహల్‌ను రూ.18 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఈ ఖరీదైన బౌలర్ ఎడమచేతి వాటం బ్యాటర్లను ఎదుర్కొనడంలో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వంటి లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్‌పై చాహల్‌ను ప్రయోగించడానికి అయ్యర్ పెద్దగా ఇష్ట పడకపోవచ్చని సంజయ్ బంగర్ వ్యాఖ్యానించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో శివమ్ దూబేకు వ్యతిరేకంగా చాహల్‌ను అయ్యర్ బౌలింగ్‌కు దించలేదని ఈ సందర్భంగా గుర్తుచేశాడు. ఇద్దరు ఎడమచేతి వాటం బ్యాటర్లు క్రీజులో ఉన్నప్పుడు చాహల్ పరుగుల సగటు 12 వరకు ఉంటోందని తెలిపాడు.


ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఎనిమిది ఇన్నింగ్స్‌లలో, చాహల్ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌లకు 64 బంతుల్లో 110 పరుగులు ఇచ్చి ఒకే ఒక వికెట్ మాత్రమే తీశారు. ఇది అతని వైఫల్యాన్ని నిదర్శనంగా మారింది. అందుకే ఇవాళ ఎస్ఆర్‌హెచ్‌తో జరిగే మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలపై చాహల్‌తో బౌలింగ్ చేయించడానికి అయ్యర్ అంత త్వరగా నిర్ణయం తీసుకోకపోవచ్చని సంజయ్ అభిప్రాయపడ్డాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌లకు గతంలో బాగా బౌలింగ్ చేసినా, ప్రస్తుతం ఇబ్బంది పడటానికి గల కారణాన్ని చాహల్ స్వీయ సమీక్షించుకోవాలని సంజయ్ బంగర్ సూచించారు.


ఇవి కూడా చదవండి:

సంజు శాంసన్ మా జట్టుకు వెన్నుముక: రుతురాజ్

భారత టీ20 జట్టులో వైభవ్ సూర్యవంశీకి అవకాశం!

Updated Date - May 06 , 2026 | 04:47 PM