Share News

ఐపీఎల్ 2026: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో అమీతుమీ.. టాస్ నెగ్గిన పంజాబ్ కింగ్స్

ABN , Publish Date - May 06 , 2026 | 07:15 PM

ఐపీఎల్ 2026లో మరో కీలక సమరానికి వేళైంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్.. మూడో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన పంజాబ్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఎస్ఆర్‌హెచ్ తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.

ఐపీఎల్ 2026: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో అమీతుమీ.. టాస్ నెగ్గిన పంజాబ్ కింగ్స్
PBKS vs SRH

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో మరో కీలక సమరానికి వేళైంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్.. మూడో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన పంజాబ్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఎస్ఆర్‌హెచ్ తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. వరుసగా రెండు ఓటములు చవిచూసిన పంజాబ్.. ఈ మ్యాచ్‌తో మళ్లీ గెలుపు బాట పట్టాలని చూస్తోంది. గత మ్యాచ్‌లో కేకేఆర్‌పై ఓడిన హైదరాబాద్.. పంజాబ్‌ను ఢీకొట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లాలనే పట్టుదలతో ఉంది. అయితే ఈ ఉత్కంఠ పోరుకు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదిక అవ్వనుండటం విశేషం.


పంజాబ్ కింగ్స్ తుది జట్టు

శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), ప్రభ్‌సిమ్రన్ సింగ్(వికెట్ కీపర్), కూపర్ కనోలి, శశాంక్ సింగ్, సూర్యాంశ్ షెడ్గె, స్టోయినిస్, యాన్సెన్, ఫెర్గుసన్, విజయకుమార్ వైశాఖ్, అర్ష్‌దీప్ సింగ్, చాహల్

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: ప్రియాంశ్ ఆర్య, హర్పీత్ బ్రార్, బార్ట్‌లెట్, విష్ణు వినోద్, ముషీర్ ఖాన్


ఎస్ఆర్‌హెచ్ తుది జట్టు

ప్యాట్ కమిన్స్(కెప్టెన్), అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), క్లాసెన్, సలీల్ అరోరా, స్మరన్ రవిచంద్రన్, నితీశ్ కుమార్ రెడ్డి, శివాంగ్ కుమార్, ఎషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: అనికేత్ వర్మ, ప్రఫుల్ హింగే, లివింగ్‌స్టోన్, హర్ష్ దూబె, హర్షల్ పటేల్

Updated Date - May 06 , 2026 | 07:15 PM