ఐపీఎల్ 2026: ఉప్పల్‌లో సెంచరీతో గర్జించిన పులి.. ఢిల్లీ క్యాపిటల్స్ ముందు భారీ టార్గెట్
ABN , Publish Date - Apr 21 , 2026 | 09:25 PM
సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు దుమ్మురేపారు. ఉప్పల్ స్టేడియంలో సిక్సర్లు, బౌండరీల వర్షం కురిసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 242 పరుగుల స్కోర్ చేసింది. ఢిల్లీకి 243 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఇంటర్నెట్ డెస్క్: సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు దుమ్మురేపారు. ఉప్పల్ స్టేడియంలో సిక్సర్లు, బౌండరీల వర్షం కురిసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 242 పరుగుల స్కోర్ చేసింది. ఢిల్లీకి 243 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. హైదరాబాద్ కా షేర్ అభిషేక్ శర్మ సెంచరీతో చెలరేగాడు. 68 బంతుల్లో 10 సిక్సర్లు, 10 ఫోర్లతో ఏకంగా 135 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్ల విధ్వంసాన్ని ఆపేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల శక్తి సరిపోలేదు.
ట్రావిస్ హెడ్(37; 26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇషాన్ కిషన్(25; 13 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) పర్వాలేదనిపించారు. ఆఖర్లో వచ్చిన క్లాసెన్(37*; 13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగాడు. ఢిల్లీ బౌలర్లు ఈ మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. పడిన రెండు వికెట్లలో ఒకటి కెప్టెన్ అక్షర్ పటేల్ తీశాడు. ఇషాన్ కిషన్ అనూహ్యంగా రనౌట్‌గా వెనుదిరిగాడు.
ఇవి కూడా చదవండి:
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టీమిండియా మహిళల స్థానాలివే!
కండరాల గాయం.. ఐపీఎల్ నుంచి ఆయుశ్ మాత్రే ఔట్