Share News

ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్‌తో పోరు.. టాస్ నెగ్గిన కేకేఆర్

ABN , Publish Date - May 20 , 2026 | 07:17 PM

ఐపీఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన కేకేఆర్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.

ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్‌తో పోరు.. టాస్ నెగ్గిన కేకేఆర్
KKR vs MI

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన కేకేఆర్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. గాయం కారణంగా గత మ్యాచ్‌లకు దూరమైన హార్దిక్ పాండ్య.. కోలుకుని జట్టుతో కలిశాడు. కాగా ఈ పోరులో కేకేఆర్ నెగ్గితే ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి 13 పాయింట్లతో ఆరో స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిందే. అయితే ముంబై ఇండియన్స్ ఇప్పటికే ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.


ముంబై ఇండియన్స్ తుది జట్టు

హార్దిక్ పాండ్య(కెప్టెన్), ర్యాన్ రికెల్టన్, రోహిత్ శర్మ, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, విల్ జాక్స్, బోష్, దీపక్ చాహర్, బుమ్రా, రఘు శర్మ

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: శార్దూల్ ఠాకూర్, మయాంక్ రావత్, రాబిన్ మింజ్, క్రిష్ భగత్, ఘజన్‌ఫర్


కేకేఆర్ తుది జట్టు

అజింక్య రహానె(కెప్టెన్), అంగ్‌క్రిష్ రఘువంశీ(వికెట్ కీపర్), గ్రీన్, పొవెల్, మనిశ్ పాండే, రింకు సింగ్, సునీల్ నరైన్, అనుకుల్ రాయ్, కార్తిక్ త్యాగి, వరుణ్ చక్రవర్తి, సౌరభ్ దూబె

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: ఫిన్ అలెన్, వైభవ్ అరోరా, రమన్‌దీప్ సింగ్, తేజస్వి దాహియా, రాహుల్ త్రిపాఠి


ఇవి కూడా చదవండి:

అందుకే టెస్టు కెప్టెన్సీని వదిలేశా.. ఎట్టకేలకు మౌనం వీడిన కోహ్లీ

బంగ్లాదేశ్ చేతిలో పాకిస్థాన్ చిత్తు.. టెస్టు సిరీస్ క్లీన్‌స్వీప్

Updated Date - May 20 , 2026 | 07:17 PM