ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన కేకేఆర్
ABN , Publish Date - Apr 06 , 2026 | 07:19 PM
ఐపీఎల్ 2026లో భాగంగా నేడు కీలక పోరు జరగనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కేకేఆర్ జట్టు.. బ్యాటింగ్ ఎంచుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా నేడు కీలక పోరు జరగనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కేకేఆర్ జట్టు.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత పంజాబ్ కింగ్స్ బౌలింగ్ చేయనుంది. ఆడిన రెండు మ్యాచుల్లో గెలిచి రెట్టింపు ఉత్సాహంతో పంజాబ్ బరిలోకి దిగనుంది. కాగా కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంకా గెలుపు ఖాతా తెరవలేదు. హోం గ్రౌండ్‌లోనైనా కోల్‌కతా గెలుస్తుందేమో చూడాలి. ఇదిలా ఉండగా, కేకేఆర్ స్టార్ బౌలర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.
కేకేఆర్ తుది జట్టు..
ఫిన్ అలెన్, అజింక్య రహానె(కెప్టెన్), కామెరూన్ గ్రీన్, అంగ్‌క్రిష్ రఘువంశీ(వికెట్ కీపర్), పొవెల్, రింకు సింగ్, రమన్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, నవదీప్ సైనీ, వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి
పంజాబ్ కింగ్స్ తుది జట్టు..
ప్రభ్‌సిమ్రన్ సింగ్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), కూపర్ కానోలీ, నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, స్టొయినిస్, యాన్సెన్, బార్ట్‌లెట్, విజయకుమార్ వైశాఖ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
ఇరు జట్లు ఇంపాక్ సబ్‌స్టిట్యూట్స్ వీరే
కేకేఆర్: బ్లెస్సింగ్ ముజరబానీ, మనిశ్ పాండే, తేజస్వి సింగ్, రాహుల్ త్రిపాఠి, సౌరభ్ దూబె
పంజాబ్ కింగ్స్: ప్రియాంశ్ ఆర్య, సూర్యాంశ్, విష్ణు వినోద్, హర్పీత్ బ్రార్
ఇవి కూడా చదవండి:
అందుకే ఐపీఎల్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించా.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు
ధోనికి ఫిట్‌నెస్ టెస్ట్.. ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌తో బరిలోకి దిగనున్న తలా!