Share News

ధోనికి ఫిట్‌నెస్ టెస్ట్.. ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌తో బరిలోకి దిగనున్న తలా!

ABN , Publish Date - Apr 06 , 2026 | 03:35 PM

ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ధోని రెండు వారాలు ఆటకు దూరమంటూ సీఎస్కే మేనేజ్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ సీఎస్కే ఓడిపోవడంతో.. ఇక ధోని జట్టులో చేరి తీరాల్సిందేనని అభిమానులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.

ధోనికి ఫిట్‌నెస్ టెస్ట్.. ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌తో బరిలోకి దిగనున్న తలా!
MS Dhoni

ఇంటర్నెట్ డెస్క్: ఎన్నో ఆశలతో 2026 ఐపీఎల్ సీజన్‌ను ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. అటు బ్యాట్‌తోనూ, ఇటు బంతితోనూ ప్లేయర్లు విఫలమైన వేళ.. సీఎస్కే వరుసగా మూడో పరాజయాన్ని చవి చూసింది. ప్రస్తుతం అందరి దృష్టి.. క్రికెట్ దిగ్గజం, సీఎస్కే స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోనిపైనే ఉంది. ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ధోని రెండు వారాలు ఆటకు దూరమంటూ సీఎస్కే మేనేజ్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తలా రాక కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.


వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ సీఎస్కే ఓడిపోవడంతో.. ఇక ధోని జట్టులో చేరి తీరాల్సిందేనని అభిమానులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. రాబోయే రెండు రోజుల్లో ధోనికి ఫిట్‌నెస్ టెస్టు జరగబోతోందని సీఎస్కే క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అది పూర్తి చేసుకుని ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నట్లు సమాచారం. కాగా ఏప్రిల్ 11(శనివారం)న సీఎస్కే.. చెన్నైలోని చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. హోం గ్రౌండ్‌లో ధోని బరిలోకి దిగి జట్టుకు విజయాన్ని అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.


బ్రెవిస్ కూడా..

ధోనితో పాటు సీఎస్కే హిట్టర్ డేవాల్డ్ బ్రెవిస్ కూడా ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే బ్రెవిస్ కూడా ఢిల్లీతో మ్యాచ్‌లో ఆడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడాడు. ‘బ్రెవిస్ తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నా. మాకు ఇంకా ఐదు రోజుల సమయం ఉంది. మేం అనుకున్న విధంగానే మా ప్రణాళికలను అమలు చేస్తాం’ అని ఫ్లెమింగ్ వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

ఇషాన్ కిషన్ చేసిన మిస్టేక్.. గర్ల్‌ఫ్రెండ్ అదితి షాకింగ్ లుక్!

నన్ను వాళ్లు మాత్రం గుర్తించక పోవచ్చు: షమీ

Updated Date - Apr 06 , 2026 | 03:36 PM