ఆ వ్యూహాలను ధోని అస్సలు ఒప్పుకోడు: అంబటి రాయుడు
ABN , Publish Date - Apr 06 , 2026 | 03:00 PM
చెన్నై సూపర్ కింగ్స్ ఓటమికి బౌలింగ్ వైఫల్యమే ప్రధాన కారణమని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వెల్లడించాడు. డెత్ ఓవర్లలో సీఎస్కే అమలు చేసిన వ్యూహాలను ధోని ఉండుంటే ఆమోదించేవాడు కాదని తెలిపాడు.
స్పోర్ట్స్ డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో 43 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిన సంగతి తెలిసిందే. ఈ పరాజయంపై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు స్పందించాడు. సీఎస్కే ఓటమికి బౌలింగ్ వైఫల్యమే ప్రధాన కారణమని అతడు వ్యాఖ్యానించాడు. ఆర్సీబీ బ్యాటర్ల దెబ్బకు చివరి నాలుగు ఓవర్లలో ఏకంగా 78 పరుగులు సమర్పించింది. డెత్ ఓవర్లలో చెన్నై వ్యూహాలు బాగా లేవని.. ఎంఎస్ ధోని ఉండుంటే కచ్చితంగా వాటిని ఆమోదించే వాడు కాదని రాయుడు వెల్లడించాడు.
ఓ స్పోర్ట్స్ ఛానల్‌లో అంబటి రాయుడు మాట్లాడుతూ..' ఆర్సీబీపై డెత్ ఓవర్లలో సీఎస్‌కే ప్రణాళికలు పేలవంగా ఉన్నాయి. ప్రాక్టీస్ సెషన్స్‌లోనూ కొత్త వ్యూహాలు రచించినా.. వాటిని ధోని ఆమోదించేవాడు కాదు. రౌండ్ ది వికెట్ బౌలింగ్ చేసినప్పటికీ బ్యాటర్లు సులువుగా ఎదుర్కొంటారనేది ధోనికి బాగా తెలుసు. అందుకే, డెత్ ఓవర్లలో ఎక్కువగా యార్కర్లు, లెంగ్త్‌తో కూడిన స్లో బంతులే ప్రభావం చూపిస్తాయి. వాటిపైనే చెన్నై బౌలర్లు దృష్టిపెట్టాలి. సంప్రదాయ పద్ధతిలోనే బౌలింగ్ చేయాలి’ అని రాయుడు విశ్లేషించాడు.
చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిపై ఆ జట్టు ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టిమ్ డేవిడ్ కారణంగానే చెన్నై ఓడిందని అతడు తెలిపాడు. కేవలం 25 బంతుల్లోనే 70 పరుగులు రాబట్టిన టిమ్ డేవిడ్ ఇన్నింగ్స్ వల్లే మ్యాచ్ స్వరూపం మారిపోయిందని వెల్లడించాడు. సంజు శాంసన్ సత్తాపై తమకెలాంటి అనుమానాలు లేవని ఫ్లెమింగ్ స్పష్టం చేశాడు. సంజు సీఎస్కే ఫ్రాంచైజీలో కుదురుకోవడానికి కాస్త సమయం పడుతుందని, టీ20ల్లో ఏదైనా సరే వేగంగానే జరుగుతుందని అన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో సంజు అద్భుత ప్రదర్శన చూశామని, ఈ లీగ్‌లో తప్పకుండా నాణ్యమైన ఇన్నింగ్స్‌లను చూస్తామని ఫ్లెమింగ్ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
ఇషాన్ కిషన్ చేసిన మిస్టేక్.. గర్ల్‌ఫ్రెండ్ అదితి షాకింగ్ లుక్!
నన్ను వాళ్లు మాత్రం గుర్తించక పోవచ్చు: షమీ