ఐపీఎల్ 2026: ఇషాన్ హాఫ్ సెంచరీ.. రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ 217
ABN , Publish Date - Apr 13 , 2026 | 09:30 PM
ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. ఆర్ఆర్‌కు 217 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కెప్టెన్ ఇషాన్ కిషన్(91; 44 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు త్రుటిలో సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు.
హెన్రిచ్ క్లాసెన్(40; 26 బంతుల్లో 3 సిక్స్‌లు, 1 ఫోర్) రాణించాడు. విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ(0) డకౌట్ అయ్యాడు. ట్రావిస్ హెడ్(18) నిరాశపర్చాడు. నితీశ్ కుమార్ రెడ్డి(28; 13 బంతుల్లో 4 సిక్సర్లు) క్రీజులో ఉన్నంత సేపు దూకుడుగా ఆడాడు. అనికేత్ వర్మ(6) రనౌట్ అయ్యాడు. సలీల్ అరోరా(24*), హర్ష్ దూబె(0*) నాటౌట్‌గా నిలిచారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే, రియాన్ పరాగ్ తలొక వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
ఆశా భోస్లే మృతదేహం వద్ద కన్నీళ్లు పెట్టుకున్న సచిన్ టెండూల్కర్
రోహిత్ శర్మ గాయంపై రూథర్‌ఫర్డ్ కీలక వ్యాఖ్యలు